తలసేమియా బాధితులకు రక్తం(Blood) చాలా అవసరమని... కానీ కొవిడ్(Covid-19) వేళ రక్తదానానికి ఎవరూ ముందుకు రావట్లేదని... రాచకొండ సీపీ మహేశ్ భగవత్ (mahesh bhagwat) అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దానం(donate) చేసినవారు దైవంతో సమానమని అన్నారు.
ప్రపంచ రక్తదాన దినోత్సవం(world blood donors day) సందర్భంగా రాచకొండ పోలీస్, చుక్కల ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా నాగారంలో శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన సీపీ మహేశ్ భగవత్... అనంతరం రక్తం దానం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికీ సీపీ ధన్యవాదాలు తెలిపారు.
- ఇదీ చూడండి: రోగిని, రక్తదాతను అనుసంధానం చేసే యాప్ ఇదే!