CP CV Anand on Ganesh Immersion 2023 : హైదరాబాద్‌లో గణనాథుల నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతున్నాయని.. నగరంలో గణేశ్ నిమజ్జనాలు(Ganesh Nimajjanam) ముగింపు దశకు చేరుకున్నాయని సీపీ సీవీ ఆనంద్(Hyderabad CP CV Anand) అన్నారు. ముఖ్యంగా భాగ్యనగరంలో నిమజ్జనంలో విధులను నిర్వహించిన పోలీస్ సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. నగర్ ప్రజలను నిమజ్జనానికి సహరించాలని కోరుతున్నామని పేర్కొన్నారు.
Ganesh Idols Immersion in Hyderabad : ఈసారి భారీగా విగ్రహాలు ఏర్పాటు చేయడంతో నిమజ్జనాలు ఆలస్యం అవుతున్నాయని తెలిపారు. ఎప్పుడు లేని విధంగా ఖైరతాబాద్ గణేశ్‌ను(Khairatabad Ganesh Immersion) ముందుగా నిమజ్జనం చేశామని పేర్కొన్నారు.
Ganesh Idols Nimajjanam 2023 Hyderabad : ఈరోజు కూడా ఎక్కువ సంఖ్యలో గణేశ్ విగ్రహాలు(Ganesh Idols Nimajjanam) నిమజ్జనానికి వచ్చాయని సీపీ ఆనంద్ వెల్లడించారు. నెక్లెస్‌రోడ్డు వైపు ఉన్న విగ్రహలకు నిమజ్జనం జరుగుతున్నాయని తెలిపారు. మరో 450 విగ్రహాలు నిమజ్జనం చేయడానికి సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. జియో టాకింగ్ లెక్కల ప్రకారం.. భాగ్యనగరంలో 10,020 విగ్రహాలు నిమజ్జనం పూర్తి చేశామన్నారు. గతేడాది కంటే ఈ ఏడాది 10 నుంచి 15% ఎక్కువ విగ్రహాలు ఏర్పాటు చేశారని సీపీ చెప్పారు. మరోవైపు నిమజ్జనంలో 5 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నారు. వారు బషీర్ బాగ్, సంజీవయ్య పార్క్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో మృతి చెందారని సీపీ ఆనంద్ వివరించారు.
Hyderabad Ganesh Nimajjanam Traffic : భాగ్యనగరంలో గణనాథుల నిమజ్జనం.. వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు..
Ganesh Shobha Yatra in Hyderabad : గణేశ్ నిమజ్జనం శోభాయాత్ర(Hyderabad Ganesh Nimajjanam Shobha Yatra) కోసం 48 గంటల పాటు ప్రభుత్వ అధికారులు విధుల్లో ఉన్నారని తెలియజేశారు. ఇవాళ హుస్సేన్‌సాగర్, ప్రసాద్ ఐమాక్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశామని అన్నారు. పూర్తిగా నిమజ్జనం సాయంత్రం 5 గంటల సమయం పడుతుందని పేర్కోన్నారు.
'షీ టీమ్స్ ఈసారి ఖైరతాబాద్ గణేశ్ చుట్టూ దాదాపు 250 మందిని పట్టుకుంది. ఈ పది రోజుల కాలంలో మహిళలను అసభ్యకరంగా టచ్ చేసేవారిని సీసీ కెమెరాల ద్వారా పట్టుకోవడం జరిగింది. మహిళలు ఎక్కువగా ఉన్నచోట ఈ షీ టీమ్స్ నిఘా పెట్టాయి. దొంగతనాల సంబంధించి కేసులు ఏమి మాకు రాలేదు. నిమజ్జనాల ప్రాంతాల్లో పోలీసు అధికారులు కట్టుదిట్టంగా విధులను నిర్వహించారు.' -సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ
పోలీసు అధికారుల విజ్ఞప్తి చేసినా.. కొంతమంది మండప నిర్వాహకులు కావాలనే అలస్యంగా విగ్రహాలను తీశారని సీపీ ఫైర్ అయ్యారు. దీనిపై స్పష్టంగా మండప నిర్వాహకుల నిర్లక్ష్యం కనిపించిందన్నారు. గణేశ్ ఉత్సవాల సందర్భంగా నిమజ్జన కార్యక్రమంలో 250కి పైగా కేసులు.. పోకిరీలపై షీ టీమ్ బృందాలు నమోదు చేశాయని వెల్లడించారు. చాలాచోట్ల న్యూసెన్స్ జరిగిన ప్రజలకు ఇబ్బంది కలగవద్దని.. పోలీసులు సమన్వయంతో విధులను నిర్వహించారన్నారు.
Thiefs in Ganesh Immersion : మరోవైపు ఎన్టీఆర్ మార్గ్ వద్ద నిమజ్జనంలో జేబు దొంగలు రెచ్చిపోయారు. సుమారు 15 మంది భక్తుల వద్ద పర్సులు, సెల్ఫోన్లు చోరీకి గురయ్యాయి. బాధితులు ఎన్టీఆర్ మార్గ్‌లో ఉన్న పోలీసు కంట్రోల్ కేంద్రంలో ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు రెండు బృందాలు విడిపోయి తనిఖీలు చేపట్టగా.. ఇద్దరు అనుమానిత మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు చారవాణిలు, ఒక పర్సు స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు. ఓ మహిళ వద్ద సంచిలో నుంచి రెండు తులాల బంగారం గొలుసు, పర్స్, చారవాణిని బ్లేడ్‌తో కోసి దుండగులు కొట్టేశారు.