గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై రాచకొండ పోలీసులు, జీహెచ్‌ఎంసీ, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్వర్యంలో సరూర్‌నగర్ కట్టపై సమావేశం నిర్వహించారు. అందరి భాగస్వామ్యంతో వినాయక నిమజ్జనాలను ఘనంగా నిర్వహిస్తామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు సీపీ పేర్కొన్నారు. సరూర్‌నగర్ మినీ ట్యాంక్ బండ్‌లో నిమజ్జనం కోసం 8 క్రేన్‌లను సిద్దంగా ఉంచినట్లు ఆయన వెల్లడించారు. నిరంతరం విద్యుత్ సరఫరా కోసం జనరేటర్లు సిద్ధం చేశామన్నారు. నిఘా కోసం 200సీసీ కెమెరాలను అమర్చామని, మూడు మొబైల్ సీసీ కెమెరాల వాహనాలు కూడా గస్తీలో ఉంచామని మహేష్ భగవత్ వివరించారు. ఈ సమావేశంలో గణేష్ ఉత్సవ సమితి సభ్యులు, జీహెచ్‌ఎంసీ ఈస్ట్‌జోన్ కమిషనర్ శ్రీనివాస రెడ్డి, ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్ సింగ్, జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చూడండి :భక్తుల మొర ఆలకిస్తున్న బాలాపూర్ గణపతి