కరోనాతో మృతి చెందిన పోలీసులకు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్, ఇతర అధికారులు నివాళి అర్పించారు. హైదరాబాద్ బషీర్బాగ్లోని నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేకంగా స్మారక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మృతుల ఫోటోలతో కూడిన జ్ఞాపికతో పాటు, వారి సేవలను కొనియాడుతూ ముద్రించిన పుస్తకాన్ని మృతుల కుటుంబ సభ్యులకు సీపీ అంజనీకుమార్, అదనపు కమిషనర్ షిఖా గోయల్ అందచేశారు.
అండగా ఉంటాం..
కుటుంబ పెద్దను కోల్పోతే ఆ కుటుంబ పరిస్థితి ఏవిధంగా ఉంటుంది.. వారి ఆర్థిక స్థితిగతులు ఎలా ఉంటాయనే అంశాలను సీపీ గుర్తు చేశారు. మృతుల కుటుంబాలకు పోలీసు శాఖ తరఫున అన్నివిధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: ఒత్తిళ్లకు యువత బలి : పరువు తీసి వేధిస్తున్న లోన్ యాప్స్