ఆర్టీసీ కార్మికులకు విధుల్లో చేరాలని ప్రభుత్వం ఇచ్చిన గడువు ఈ రోజు అర్ధరాత్రితో ముగియనుంది. హైదరాబాద్‌లో 70 మంది ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరారని సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. మరో 35 మంది విధులకు హాజరవుతారని ఆయన తెలిపారు. హాజరైన వారి విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. సమ్మె వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ... విధుల్లోకి నిర్భయంగా చేరాలని ఆయన కార్మికులను కోరారు.
ఇవీ చూడండి: "డెడ్లైన్లకు భయపడేది లేదు... ఆర్టీసీకి అసలు బోర్డేలేదు"