ETV Bharat / state

వార్షిక క్రైం నివేదిక విడుదల.. 10శాతం తగ్గిన నేరాలు

ఉస్మానియా యూనివర్శిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో వార్షిక నేర నివేదికను పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ విడుదల చేశారు. గతేడాదితో పోలిస్తే నేరాలు 10 శాతం తగ్గాయని సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. మహిళలపై వేధింపుల కేసులు 19 శాతం తగ్గాయని తెలిపారు. హత్యల్లో 24 శాతం, హత్యాయత్నం కేసుల్లో 39 శాతం తగ్గుదల అపహరణ కేసులు 34 శాతం, మోసం కేసుల్లో 35 శాతం తగ్గాయని పేర్కొన్నారు.

cp
వార్షిక క్రైం నివేదిక విడుదల.. 10శాతం తగ్గిన నేరాలు
author img

By

Published : Dec 21, 2020, 1:28 PM IST

హైదరాబాద్‌లో గతేడాదితో పోలిస్తే నేరాలు 10 శాతం తగ్గాయని పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్ వెల్లడించారు. ఉస్మానియా యూనివర్శిటీ.. ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో వార్షిక నేర నివేదికను సీపీ విడుదల చేశారు. హత్యల్లో 24 శాతం, హత్యాయత్నం కేసుల్లో 39 శాతం తగ్గాయన్నారు. అపహరణ కేసులు 34 శాతం.. మోసం కేసుల్లో 35 శాతం, అత్యాచార కేసుల్లో 6 శాతం తగ్గుదల నమోదైందని సీపీ అంజనీకుమార్ తెలిపారు.

వరకట్న వేధింపులు వల్ల చనిపోయిన కేసుల్లో 14 శాతం.. వరకట్న హత్యల్లో 33 శాతం తగ్గుదల.. ఉందన్నారు. మహిళలపై వేధింపు కేసులు 19 శాతం తగ్గాయని సీపీ అంజనీకుమార్ వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు పోలీసు శాఖ చేపట్టిన చర్యలు నేరాలు తగ్గేందుకు ఫలితమిచ్చాయని సీపీ పేర్కొన్నారు. నేరాల నియంత్రణతో పాటు కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా సేవలు అందించిన పోలీసులను సీపీ అభినందించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.