హైదరాబాద్ పోలీసులు నేరాలు నియంత్రణతో పాటు సామాజిక సేవలోనూ తమ వంతు కృషి చేస్తున్నారని సీపీ అంజనీకుమార్ కొనియాడారు. కార్ఖానా పోలీసుల ఆధ్వర్యంలో కేజేఆర్ సంస్థ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని అంజనీ కుమార్ ప్రారంభించారు. రక్తదానం చేసిన వారికి ఆయన ధ్రువపత్రాలను అందజేశారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి ఈ శిబిరం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.
దాదాపు 400 మంది ఈ శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. ప్రస్తుతం కరోనా రెండో దశ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సీపీ సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని చెప్పారు.
ఇదీ చదవండి: 'కబ్జాలకు పాల్పడ్డ మంత్రులందరిపై విచారణ చేపట్టాలి '