ETV Bharat / state

'జులైలో 445 మంది వీధి బాలలకు విముక్తి' - సీపీ అంజనీ కుమార్​

ఆపరేషన్​ ముస్కాన్​లో భాగంగా 445 మంది వీధి బాలలకు విముక్తి కల్పించినట్లు సీపీ అంజనీ కుమార్​ తెలిపారు. 381 మంది చిన్నారులను తల్లిదండ్రులకు అప్పగించామన్న ఆయన... 64 మందికి ఆశ్రయం కల్పించినట్లు వివరించారు. పిల్లలను పనిలో పెట్టుకునే వారిపై కేసులు నమోదు చేసి జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.

ఆపరేషన్​ ముస్కాన్​
author img

By

Published : Aug 1, 2019, 3:30 PM IST

జులైలో 445 మంది వీధి బాలలు, బాల కార్మికులకు విముక్తి కల్పించినట్లు సీపీ అంజనీ కుమార్​ తెలిపారు. హైదరాబాద్​లో ఆపరేషన్​ ముస్కాన్​-5 వివరాలు వెల్లడించారు. పోలీసులు కాపాడిన వారిలో 407 మంది బాలురు, 38 మంది బాలికలు ఉన్నారని తెలిపారు. 381 మంది చిన్నారులను తిరిగి తల్లిదండ్రులకు అప్పగించినట్లు చెప్పారు. మొత్తం 64 మందికి అధికారులు ఆశ్రయం కల్పించినట్లు పేర్కొన్నారు. భాగ్యనగర పరిధిలో 17 బృందాలు ముస్కాన్ ​కోసం పని చేసినట్లు వివరించారు. చిన్న పిల్లలను పనిలో పెట్టుకున్న వారిపై 7 కేసులు నమోదు చేశామన్న సీపీ... రూ.18.80 లక్షల మేర జరిమానా విధించినట్లు తెలిపారు. తనిఖీల్లో దొరికిన వారిలో ఇతర రాష్ట్రాలకు చెందిన బాలలు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు.

'జులైలో 445 మంది వీధి బాలలకు విముక్తి'

ఇదీ చూడండి : అమ్మాయిలను గిల్లడమేనా... ఫ్రెండ్లీ పోలీసింగ్?: వీహెచ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.