2020 ఏడాది తొలి 6 నెలల్లో హైదరాబాద్‌లో జరిగిన నేరాలపై నివేదికను సీపీ అంజనీ కుమార్ విడుదల చేశారు. 2019తో పోలిస్తే ఈ ఏడాది తొలి అర్ధవార్షికంలో 100 నేరాలు తగ్గాయని తెలిపారు. కరోనా నేపథ్యంలో.. సామూహిక బోనాల ఉత్సవాలకు అనుమతి లేదని... అందరూ వారి ఇళ్లలోనే జరుపుకోవాలని సూచించారు.
ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు 12,273 క్రిమినల్ కేసులు నమోదుయ్యాయి. కొత్తగా 146 మంది రౌడీషీటపై కేసులు రికార్డు చేశాం. ఇప్పటివరకు 26 శాతం మంది నేరస్థులకు శిక్షపడింది.ఈ ఏడాది 154 ఇళ్లలో చోరీ కేసులు కాగా... నగరంలో ఈ ఏడాది మొత్తం 835 చోరీ కేసులు నమోదయ్యాయి. 500కు పైగా సైబర్ నేరాలు పెరిగాయి. - అంజనీ కుమార్, హైదరాబాద్ సీపీ
ఇదీ చూడండి: సచివాలయం కూల్చివేతపై లంచ్ మోషన్ పిటిషన్ తిరస్కరణ