హైదరాబాద్‌లో ర్యాలీలు, నిరసనలు, ఆందోళనలకు అనుమతి లేదని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ స్పష్టం చేశారు. ఈ నెల 28న ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్డు పరిసరాల్లో ఎటువంటి కార్యక్రమాలకు అనుమతి ఇవ్వలేదని సీపీ తెలిపారు. నిత్యం రద్దీగా ఉండే జంటనగరాల్లోని రహదారులపై ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ర్యాలీలు, సభలు, నిరసనలు నిర్వహిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు.
ఇవీ చూడండి: అనుమతి ఇవ్వకపోయినా ర్యాలీ నిర్వహిస్తాం: ఉత్తమ్