రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పతకాలు సాధించిన పలువురు పోలీసు అధికారులు, సిబ్బందిని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ అభినందించారు. నగరానికి చెందిన మొత్తం 87 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి సర్వోన్నత, మహోన్నత, ఉత్తమ సేవా పతకాలు లభించాయి. అదనపు డీసీపీ స్థాయి నుంచి కానిస్టేబుళ్ల వరకు పురస్కారాలు లభించిన వారిలో ఉన్నారు. వారందరినీ సీపీ ప్రత్యేకంగా ప్రశంసించారు.
కరోనా సమయంలో అధికారులు, సిబ్బంది మంచి పనీతీరు కనబరుస్తున్నారని సీపీ కొనియాడారు. వారి కుటుంబసభ్యులకు అంజనీకుమార్ శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చదవండి: Corona cases: రాష్ట్రంలో కొత్తగా 2,175 కరోనా కేసులు.. 15 మరణాలు