ETV Bharat / state

రేపటి నుంచి 50 మందికి టీకా పంపిణీ

author img

By

Published : Jan 17, 2021, 10:11 PM IST

Updated : Jan 17, 2021, 10:21 PM IST

తొలిరోజు ఒక్కో కేంద్రంలో కేవలం 30 మందికే పరిమితమైన కొవిడ్​ వ్యాక్సిన్​ రేపటి నుంచి 50 మందికి ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. టీకా అందించే కేంద్రాల సంఖ్యను 324కు పెంచారు.

రేపటి నుంచి 50 మందికి టీకా పంపిణీ
రేపటి నుంచి 50 మందికి టీకా పంపిణీ

రాష్ట్రంలో రేపటి నుంచి 324 కేంద్రాల్లో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగనుంది. తొలిరోజు ఒక్కో కేంద్రంలో 30 మందికి టీకా వేయగా.. ప్రస్తుతం ఆ సంఖ్యను 50 కి పెంచారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. తొలిరోజు కేవలం 140 కేంద్రాల్లో మాత్రమే వ్యాక్సిన్​ పంపిణీ చేశారు.

సోమవారం నుంచి హైదరాబాద్​లో 42 కేంద్రాల్లో కరోనా టీకా అందించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాల వారీగా వ్యాక్సిన్​ తీసుకునే వారి జాబితాను ఇప్పటికే సిద్ధం చేశారు. రేపటి నుంచి ప్రతి కేంద్రంలో 50 మందికి సిబ్బంది టీకాలు వేయనున్నారు.

ఇదీ చూడండి : కేంద్ర విద్యాశాఖ మంత్రికి వినోద్​కుమార్​ లేఖ

Last Updated : Jan 17, 2021, 10:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.