నేటి నుంచి 45 ఏళ్లు దాటిన వారికి కొవిడ్ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు డీహెచ్ శ్రీనివాస్ తెలిపారు. తెలంగాణలో 45 ఏళ్లు దాటినవారు సుమారు 80 లక్షల మంది ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు తొలి విడత టీకా ఇచ్చినట్లు వెల్లడించారు. ఇప్పటికే ఆరోగ్య సమస్యలున్న 45 ఏళ్లు దాటినవారికి టీకా వేసినట్లు స్పష్టం చేశారు.
దాదాపు 10 లక్షల మందికి తొలి విడత టీకా ఇచ్చాం. రోజుకు లక్ష మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశాం. రెండు వారాలుగా వ్యాక్సినేషన్‌కు మంచి స్పందన లభించింది. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని కేంద్రం సూచించింది.
--- శ్రీనివాస్, ప్రజారోగ్య సంచాలకులు
ఇదీ చూడండి: 'ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించండి... కరోనాను దరిచేరనీయకండి'