ETV Bharat / state

Vaccination: గ్రేటర్​లో వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్.. వారి కోసమే.!

గ్రేటర్​లో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. జంట నగరాల్లో ఇప్పటికే ఏర్పాటు చేసిన టీకా కేంద్రాల ద్వారా ప్రక్రియ మరింత వేగవంతమైంది. తాజాగా నగరంలోని స్వయ సహాయక బృందాలు, జీహెచ్​ఎంసీ ఉద్యోగుల కోసం స్పెషల్ డ్రైవ్ ప్రారంభించింది.

గ్రేటర్​లో వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్

author img

By

Published : Jul 8, 2021, 12:16 AM IST

నగరంలోని కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకుంది. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని స్వయం సహాయక బృందాల మహిళలు, జీహెచ్​ఎంసీ ఉద్యోగుల కోసం ప్రత్యేక వాక్సినేషన్​ డ్రైవ్ ప్రారంభించింది. మహిళలతో పాటు వారి కుటుంబసభ్యులు, జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు, సిబ్బంది, కార్మికుల కుటుంబ సభ్యులందరికీ కూడా కొవిడ్ టీకా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

జీహెచ్​ఎంసీ స్పెషల్ డ్రైవ్

జంట నగరాల్లో 18 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు అందరికీ ఉచితంగా కరోనా టీకా ఇవ్వడానికి ఇప్పటికే 100 వాక్సిన్ కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. నగరంలోని అన్ని వర్గాల ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందజేస్తున్నారు. తాజాగా స్వయం సహాయక బృందాల మహిళలు, జీహెచ్ఎంసీ ఉద్యోగుల కుటుంబ సభ్యులందరికీ టీకాలు ఇచ్చేందుకు జీహెచ్ఎంసీ "స్పెషల్ డ్రైవ్" ప్రారంభించింది. ఇందులో భాగంగా బుధవారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని సర్కిళ్లలో స్వయం సహాయక మహిళా బృందాలకు సమావేశాలు ఏర్పాటు చేసింది. వారు తమ కుటుంబ సభ్యులందరికీ విధిగా వ్యాక్సిన్ ఇప్పించేందుకు సమీపంలోని కేంద్రాలకు వెళ్లాల్సిందిగా సూచనలు చేశారు. నగరంలో ఏర్పాటు చేసిన వంద కేంద్రాల్లో స్వయం సహాయక మహిళా బృందాలు, జీహెచ్ఎంసీ ఉద్యోగుల కుటుంబ సభ్యులతోపాటు అన్ని వర్గాలకు టీకాలు ఇచ్చేలా కార్యక్రమం ఏర్పాటు చేశారు.

రిజిస్ట్రేషన్ తప్పనిసరి

అయితే 18 ఏళ్లకు పైబడిన ప్రతీ ఒక్కరూ ముందుగా కొవిన్ పోర్టల్​లో పేర్లు నమోదు చేసుకోవాలని అధికారులు తెలిపారు. https://selfregistration.cowin.gov.in లింక్​ ద్వారా తమ పేరు, ఆధార్ సంఖ్య, చిరునామా వివరాలు నమోదు చేయాల్సి ఉంటుందని వివరించారు. ఈ పోర్టల్‌లో తమ వివరాలు నమోదు చేసుకున్న అనంతరం... తమ మొబైల్ ఫోన్లకు సందేశం వస్తుందన్నారు. అనంతరం వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్లాలని జీహెచ్ఎంసీ సిబ్బందికి తెలిపారు.

ప్రతి కేంద్రంలో రోజుకు కనీసం వెయ్యి మందికి వ్యాక్సిన్ ఇచ్చే ఏర్పాట్లు చేసింది. కొవిడ్ వ్యాక్సిన్ తమ సమీప కేంద్రాల్లో ఉచితంగా తీసుకోవాలని కోరుతూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 12.91 లక్షల మంది ఆస్తి పన్ను చెల్లింపుదారులు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందించినట్లు జీహెచ్ఎంసీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో దశల వారీగా కరోనా వ్యాక్సినేషన్​ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. మొదట ఫ్రంట్​ లైన్​ వారియర్స్​, 45 ఏళ్ల పైబడిన వారు, సూపర్​ స్ప్రెడర్లు, హైరిస్క్​ జోన్​లో ఉన్నవారు ఇలా ప్రాధాన్యత క్రమంలో చేపట్టగా.. తాజాగా 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా కార్యక్రమం చేపట్టింది.

ఇదీ చూడండి: Vaccine: 18 పైబడిన వారికి టీకా.. జీహెచ్​ఎంసీ పరిధిలో 100 వ్యాక్సిన్​ కేంద్రాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.