హైదరాబాద్ నగరంలో రోజురోజుకు కొవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలో కొవిడ్ నిర్ధరణ పరీక్షల కోసం అనుమానితులు క్యూ కడుతున్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా శుక్రవారం సుమారు 120 కేసులు వచ్చాయి. కొవిడ్ నిబంధనలు గాలికొదిలేయడం వల్ల గత కొన్ని రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోందని అధికారులు తెలిపారు.
ప్రధానంగా మాస్కులు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం వైరస్ వ్యాప్తికి కారణమవుతోందని వైద్యులు తెలిపారు. సమూహాలుగా గుమిగూడడం, అనవసరంగా రోడ్లపై తిరగడం వల్ల కొవిడ్ కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజలు జాగ్రత్తలు పాటించకపోతే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.
ఇదీ చూడండి: కరోనా బారినపడి హెడ్ కానిస్టేబుల్ మృతి