రాష్ట్రంలో కొవిడ్ వైరస్ వ్యాప్తి నానాటికీ పెరుగుతూనే ఉంది. కొత్తగా 1,524 మందికి వైరస్ సోకినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. ఫలితంగా బాధితుల సంఖ్య 37,745కు చేరింది.
జీహెచ్ఎంసీ పరిధిలోనే 815..
కొత్త కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే 815 కేసులు వెలుగు చూశాయి. రంగారెడ్డి జిల్లాలో 240 మందికి వైరస్ సోకింది. మేడ్చల్ 97, సంగారెడ్డి జిల్లాలో 61 కొత్త కేసులు నమోదయ్యాయి. నల్గొండ 38, వరంగల్ అర్బన్ 30, కరీంనగర్ 29, మెదక్‌లో 24 మందికి వైరస్ సోకింది. వికారాబాద్ 21, కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లో 19 చొప్పున కేసులు బయటపడ్డాయి.
నిజామాబాద్ 17, సూర్యాపేట 15, గద్వాల్ జిల్లాలో 13 మందికి వైరస్ నిర్ధరణ అయింది. మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో 12 చొప్పున కరోనా బారిన పడ్డారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో 8 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఏడుగురికి, ములుగు జిల్లాలో ఆరుగురికి కరోనా సోకింది. వనపర్తి, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఐదేసి కేసులు నమోదయ్యాయి. సిద్దిపేట, జనగామ జిల్లాల్లో నాలుగేసి కేసులు వచ్చాయి. నిర్మల్‌లో ముగ్గురు, జగిత్యాల, వరంగల్ రూరల్ జిల్లాల్లో ఇద్దరు చొప్పున వైరస్ బారినపడ్డారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఒక కేసు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
375కు చేరిన మృతుల సంఖ్య..
మంగళవారం మరో 11 వందల 61 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు వ్యాధి నయమైన వారి సంఖ్య 24, 840కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 12,531 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా కారణంగా మరో 10 మంది చనిపోయారు. మృతుల సంఖ్య 375కి చేరింది. మంగళవారం మరో 13,175 మందికి పరీక్షలు నిర్వహించగా... ఇప్పటివరకు పరీక్షలు నిర్వహించిన వారి సంఖ్య...1,95,024కు చేరినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.
ఇవీచూడండి: 'గాంధీలోని కొవిడ్ బాధితులు బయటికెళ్లారనే వార్తల్లో వాస్తవం లేదు'