ETV Bharat / state

రేపు రాష్ట్రంలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ డ్రై రన్‌కు ఏర్పాట్లు - covid 19 Vaccine Dry run in hyderabad

corona dry run
corona dry run
author img

By

Published : Jan 1, 2021, 4:26 PM IST

Updated : Jan 1, 2021, 5:04 PM IST

16:25 January 01

రేపు రాష్ట్రంలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ డ్రై రన్‌కు ఏర్పాట్లు

రాష్ట్రంలో రేపు నిర్వహించనున్న కొవిడ్‌ వ్యాక్సిన్‌ డ్రై రన్‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్, మహబూబ్‌నగర్‌లో 3 ఆస్పత్రుల చొప్పున డ్రై రన్ నిర్వహించనున్నారు. రేపు ఉదయం ప్రారంభంకానుంది. హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని ఒక్కో కేంద్రంలో మూడు విడతలుగా నిర్వహిస్తారు. ఒక్కో చోట కనీసం 100 మందిని ఇందులో భాగస్తులను చేయనున్నారు.  

కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాల ప్రకారం 100 మంది టీకా లబ్ధిదారుల్లో కొందరు వైద్యసిబ్బంది, మరికొందరు సాధారణ పౌరులు ఉండే విధంగా చర్యలు తీసుకుంటారు. టీకా లబ్ధిదారులను కేంద్రానికి వచ్చేలా సమీకరించడం, కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ వరుసల్లో నిలబెట్టడం, వారి సమాచారాన్ని యాప్‌లో నమోదు చేయడం... తదితర అన్ని దశలను డ్రైరన్‌లో ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు.  

నేరుగా టీకా ఇవ్వడం తప్ప.. మిగిలిన అన్ని ప్రక్రియలను పర్యవేక్షిస్తారు. ఏ దశలోనైనా లోటుపాట్లు ఎదురైతే ప్రత్యేక పుస్తకంలో పొందుపరుస్తారు. డ్రైరన్‌ సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తారు.  

Last Updated : Jan 1, 2021, 5:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.