ETV Bharat / state

'పాజిటివ్ కేసుల్లో 77.17 శాతం మంది కోలుకున్నారు' - తెలంగాణలో కరోనా రికవరీలు

రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడే వారి సంఖ్యే కాదు... కోలుకునే వారి సంఖ్య కూడా అధికంగానే ఉండటం కాస్త ఊరటనిస్తోంది. కొవిడ్ సోకి ఆరోగ్యవంతులుగా మారిన వారి సంఖ్య 75,186కు చేరుకుంది. మొత్తం పాజిటివ్ కేసుల్లో 77.17 శాతం మంది కోలుకున్నారని ఆరోగ్యశాఖ వెల్లడించింది.

covid 19 recovery rate improve in telangana state
'పాజిటివ్ కేసుల్లో 77.17 శాతం మంది కోలుకున్నారు'
author img

By

Published : Aug 21, 2020, 6:36 AM IST

రాష్ట్రంలో గురువారం 1,724 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 97,424కు పెరిగింది. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో 77.17 శాతం మంది కోలుకున్నారని ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా 1,195 మంది కోలుకోగా... మొత్తంగా కరోనా బారినపడి ఆరోగ్యవంతులుగా మారిన వారి సంఖ్య 75,186కు చేరినట్లు వివరించింది. ఈ విషయంలో జాతీయ సగటు 73.64 శాతమని తెలిపింది.

ఈనెల 19న రాత్రి 8 గంటల వరకూ నమోదైన సమాచారాన్ని వైద్యఆరోగ్యశాఖ గురువారం విడుదల చేసింది. తాజా ఫలితాల ప్రకారం జీహెచ్‌ఎంసీ(హైదరాబాద్‌) పరిధిలో 395 కేసులు నిర్ధారణయ్యాయి. 20కి పైగా పాజిటివ్‌లు నమోదైన జిల్లాల జాబితాలో రంగారెడ్డి(169), మేడ్చల్‌ మల్కాజిగిరి(105), కరీంనగర్‌(101), వరంగల్‌ నగర(91), నల్గొండ(67), నిజామాబాద్‌(61), సిద్దిపేట(61), మంచిర్యాల(45), సంగారెడ్డి(45), సూర్యాపేట(44), పెద్దపల్లి(43), ఖమ్మం(42), జోగులాంబ గద్వాల(37), రాజన్న సిరిసిల్ల(37), జగిత్యాల(35), మెదక్‌ (34), వరంగల్‌ గ్రామీణ(32), కామారెడ్డి(32), మహబూబ్‌నగర్‌(32), మహబూబాబాద్‌(28), వనపర్తి(28), భద్రాద్రి కొత్తగూడెం(27), నిర్మల్‌(23), నాగర్‌కర్నూల్‌(22) ఉన్నాయి.

మరణాలు 0.74 శాతం

మహమ్మారి బారినపడి ఇంకో 10 మంది మృత్యువాతపడగా... మొత్తంగా కరోనా మరణాల సంఖ్య 729కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 21,509 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఆసుపత్రుల్లోని ఐసొలేషన్‌ కేంద్రాల్లో, ఇళ్లలో వైద్యసేవలు పొందుతున్న వారు 15,076 మంది. కొవిడ్‌ చికిత్స కోసం ప్రభుత్వ వైద్యంలో మొత్తంగా 7,952 పడకలు కేటాయించగా... బుధవారం నాటికి 5,505 పడకలు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేటు వైద్యంలో 8,641 పడకలు కేటాయించగా 4,655 పడకలు ఖాళీగా ఉన్నట్లు వైద్యఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది.

ఇదీ చూడండి: 'సీజనల్​ వ్యాధుల నియంత్రణకు అన్ని చర్యలు తీసుకోండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.