సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో మెహదీపట్నం ప్రాంతానికి చెందిన కరోనా బాధితుడి మృతదేహం అదృశ్యమైంది. కొవిడ్-19 పాజిటివ్ కారణంగా గాంధీలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. బుధవారం అతని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. మృతుడి కుటుంబ సభ్యులు అతని మృతదేహాన్ని అడగ్గా... మృతదేహం అదృశ్యమైనట్లు వైద్య సిబ్బంది తెలిపారు.
తమ సోదరుడి మృతదేహాన్ని అప్పగించాలని కోరుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, స్థానిక ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. అతని మృతదేహాన్ని ఇతరులకు అప్పగించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. బుధవారం ఎంత మంది చనిపోయారు?, మార్చురీకి ఎవరిని తరలించారన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఇదీ చూడండి: దేశంలో 90 శాతం ఉద్యోగులకు ఆదాయ గండం!