ETV Bharat / state

కరోనా కలవరం... కొత్తగా 945 మందికి పాజిటివ్ - తెలంగాణ తాజా వార్తలు

రాష్ట్రంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. మంగళవారం 945 మంది కొవిడ్‌ బారిన పడ్డారు. మరో ఏడుగురు మహమ్మారితో ప్రాణాలు కోల్పోయారు. ఒక్క రోజే 1,712 మంది డిశ్చార్జి కావడం ఊరటనిస్తోంది. మరోవైపు వైరస్‌ సోకిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల్లో 92 శాతం మంది కోలుకోవడం శుభపరిణామంగా నిపుణులు పేర్కొంటున్నారు.

945new positive cases
రాష్ట్రంలో కొనసాగుతోన్న కరోనా కల్లోలం
author img

By

Published : Jul 1, 2020, 4:43 AM IST

Updated : Jul 1, 2020, 6:10 AM IST

కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మంగళవారం 945 మందికి పాజిటివ్​ నిర్ధరణ అయిందని వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం వైరస్‌ బాధితుల సంఖ్య 16,339కి చేరింది. మరో ఏడుగురు కరోనాకు బలయ్యారు. ఇప్పటివరకూ మృతిచెందిన వారి సంఖ్య 260కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఒక్కరోజే 1,712 మంది డిశ్చార్జి అయ్యారు. వైరస్‌ బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 7,294కి చేరింది.

భాగ్యనగరంలోనే అత్యధికం

మంగళవారం నమోదైన కేసుల్లో అత్యధికం గ్రేటర్‌ హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ పరిధిలోనివే. జీహెచ్​ఎంసీ పరిధిలో 869 కేసులు నిర్ధరణ అయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 29, మేడ్చల్‌ జిల్లాలో 13, సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి జిల్లాలో 21 కేసులు వచ్చాయి. కరీంనగర్ జిల్లాలో 2, సిద్దిపేట జిల్లాలో 1, నిర్మల్ జిల్లాలో 4, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 2 వైరస్‌ కేసులు వెలుగుచూశాయి. సూర్యాపేట, ఖమ్మం, వికారాబాద్, నిజామాబాద్ జిల్లాలో ఒక్కో పాజిటివ్ కేసు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

హైదరాబాద్ సుల్తాన్‌బజార్‌ పోలీస్ట్‌స్టేషన్‌ పరిధిలో మరో ఏడుగురు కరోనా బారిన పడ్డారు. ఇందులో ఓ కానిస్టేబుల్‌ కూడా ఉన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో ఓ వృద్ధురాలి అంత్యక్రియల్లో పాల్గొన్న 24 మందిలో ముగ్గురికి కరోనా సోకింది. అప్రమత్తమైన అధికారులు మిగతావారికి నిర్ధరణ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. వికారాబాద్ జిల్లాకు చెందిన 75ఏళ్ల వృద్ధురాలు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. వృద్ధురాలి కుమారుడికి వైరస్​ సోకింది.

కష్టకాలంలో ఇదొక్కటే శుభవార్త

కరోనా బారిన నుంచి కోలుకుని మంగళవారం 1,712 మంది డిశ్చార్జి అవడం ఊరట కలిగిస్తోంది. మరోవైపు... మహమ్మారి బారిన పడ్డ దీర్ఘకాలిక రోగుల్లో 92 శాతం మంది కోలుకున్నారు. మధుమేహ రోగులు 94 శాతం మంది, బీపీ బాధితులు 80 మంది వైరస్‌ను జయించారు. మార్చి 2 నుంచి జూన్‌ 28 వరకు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్నవారి వివరాలను పరిశీలిస్తే... ఈ విషయం స్పష్టమవుతోంది. గాంధీలో చికిత్స తీసుకున్న సుమారు 5వేల మంది కొవిడ్‌ బాధితుల్లో సగం వరకూ దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్నవారే. వీరిలో 203 మంది మృతిచెందారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కరోనాను జయించడం శుభపరిణామంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న వారిలో 17 మంది, డయాలసిస్‌ చేయించుకుంటున్న వారిలో 70 మంది, పక్షవాతం వచ్చినవారిలో 10 మంది కోలుకున్నారు. కరోనా సోకితే ఇక మరణమే అనే ఆందోళన అవసరంలేదని...తగిన జాగ్రత్తలతో కోలుకోవచ్చని గాంధీ సూపరింటెండెంట్‌ రాజారావు తెలిపారు.

ఇవీచూడండి: ఊపిరాడ్తలేదు డాడీ.. సెల్ఫీ వీడియోలో కరోనా బాధితుడి ఆర్తనాదం

Last Updated : Jul 1, 2020, 6:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.