ETV Bharat / state

కొవాగ్జిన్‌ టీకా సురక్షితమే: భారత్‌ బయోటెక్‌ - కొవాగ్జిన్‌ తాజా వార్తలు

కొవాగ్జిన్​ టీకా వేసిన తర్వాత తలెత్తిన దుష్ప్రభావాలు ఎలాంటి మందుల అవసరం లేకుండానే తగ్గిపోయాయని భారత్​ బయోటెక్​ తెలిపింది. తొలి దశ ట్రయల్స్‌కు సంబంధించి మధ్యంతర ఫలితాల్ని బుధవారం విడుదల చేసింది.

covaxin
కొవాగ్జిన్‌ టీకా సురక్షితమే: భారత్‌ బయోటెక్‌
author img

By

Published : Dec 16, 2020, 10:15 PM IST

కరోనా వైరస్‌ కట్టడికి దేశీయంగా భారత్‌ బయోటెక్‌ రూపొందిస్తున్న ‘కొవాగ్జిన్‌’ టీకాపై ఆ సంస్థ శుభవార్త చెప్పింది. కొవాగ్జిన్‌ టీకా ఎలాంటి ప్రతికూల ప్రభావాల్ని చూపడం లేదని వెల్లడించింది. తొలి దశ ట్రయల్స్‌కు సంబంధించి మధ్యంతర ఫలితాల్ని బుధవారం విడుదల చేసింది.

‘టీకా తొలి వ్యాక్సినేషన్‌ తర్వాత తలెత్తిన దుష్ప్రభావాలు ఎలాంటి మందుల అవసరం లేకుండానే తగ్గిపోయాయి. ఒక ప్రతికూల విషయం ఏంటంటే... ఇంజక్షన్‌ వేసిన చోట నొప్పి ఏర్పడుతోంది. అదీ క్రమంగా తగ్గింది. ఫేజ్‌ 1 ట్రయల్స్‌ మధ్యంతర ఫలితాల ప్రకారం.. టీకా రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించడమే కాక, ఎలాంటి ప్రతికూల ప్రభావాల్ని చూపలేదు’ అని భారత్‌ బయోటెక్‌ పేర్కొంది.

భారత్‌ బయోటెక్‌ సంస్థ తాము రూపొందించిన ‘కొవాగ్జిన్‌’ టీకా అత్యవసర వినియోగం కోసం గతనెలలో నియంత్రణ సంస్థకు దరఖాస్తు చేయగా.. ఆరోగ్య నిపుణుల కమిటీ ఇంకా అనుమతి ఇవ్వలేదు. టీకా భద్రతకు సంబంధించి మరింత సమాచారంతో నివేదిక సమర్పించాలని కోరింది. టీకా అత్యవసర వినియోగం కోసం నియంత్రణ సంస్థ అనుమతి పొందాలంటే దాని సమర్థత, భద్రతపై ఆ సంస్థ స్పష్టమైన సమాచారాన్ని విడుదల చేయాల్సి ఉంటుంది. కాగా కొవాగ్జిన్‌ను ప్రస్తుతం దేశవ్యాప్తంగా 18 ప్రాంతాల్లో 22వేల మంది వాలంటీర్లపై ఫేజ్‌ 3 ట్రయల్స్‌ కొనసాగిస్తోంది.

ఇవీచూడండి: 'కొవాగ్జిన్‌ పూర్తిగా సురక్షితం-200% పారదర్శకంగా ఉంటున్నాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.