హైదరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ పేర్వారం రాములుకు సిటీ సివిల్ కోర్టు వారంట్ జారీ చేసింది. పేర్వారం రాములు 2001లో హైదరాబాద్ సీపీగా ఉన్న సమయంలో భూ కబ్జా ఆరోపణలపై అప్పటి సీఐ ఎం.మాధవరెడ్డిని పీడీ చట్టం కింద అరెస్ట్ చేశారు. ఈ విషయమై మాధవరెడ్డి సిటీ సివిల్ కోర్టులో రాములుతో పాటు పలువురిపై పరువునష్టం కేసు వేశారు. విచారణ జరిపిన కోర్టు మాధవరెడ్డికి రూ.75 లక్షలను 7 శాతం వడ్డీతో చెల్లించాలని 2017లో రాములును ఆదేశించింది. ఒకవేళ ఆయన చెల్లించకపోతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి చెల్లించి.... పేర్వారం రాములు నుంచి రికవరీ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. గత ఏప్రిల్ నెలలో వారంట్ జారీ చేసిన కోర్టు రేపు విచారణ చేపట్టనుంది.
ఇవీ చూడండి: 5నెలల్లో పురపాలక ఎన్నికలు పూర్తి చేయాలి