దివంగత ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఇంటికి సిటీ సివిల్ కోర్టు నోటిసులు జారీ చేసింది. దాసరి నారాయణరావు కుమారులు(dasari narayana rao sons) దాసరి ప్రభు, దాసరి అరుణ్‌లు వ్యాపార లావాదేవీల్లో భాగంగా ఓ ప్లాంట్ నిర్మాణం కోసం రూ.2కోట్ల 11లక్షల తీసుకున్నారని సోమశేఖర్‌రావు అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. తిరిగి డబ్బులు చెల్లించంలో వీరిద్దరూ జాప్యం చేస్తున్నారంటూ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌ను విచారణలోకి తీసుకున్న కోర్టు... దాసరి ప్రభు, దాసరి అరుణ్‌లకు ఆర్డర్ 34, సీపీసీ 151 సెక్షన్ల కింద నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు జూబ్లీహిల్స్‌లోని రోడ్ నంబర్ 46 సీబీఐ కాలనీలోని ఆయన ఇంటికి వచ్చిన కోర్టు సిబ్బంది... నోటీసులు అంటించి వెళ్లిపోయారు. ఈ నెల 15న అనగా రెండు వారాల గడువులోగా ఆ డబ్బును చెల్లించాలని ఆ నోటీసులో ఆదేశించింది.
ఇదీ చదవండి: Naga shaurya farm house case: 'పేకాడదాం రండి'.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులకు ఆహ్వాన కార్డులు