ETV Bharat / state

నిరాడంబర వివాహ మహోత్సవమిది... - తెలంగాణ తెలుగు వార్తలు

పెళ్లంటే బాజాభజంత్రీలు, డప్పు చప్పులు, వేద మంత్రాలు.. ఇవేనా...? కాదు ఎలాంటి ఆడంబరాలు లేకుండా.. నాకు నువ్వు, నీకు నేను తోడుంటానని ప్రమాణం చేసుకుని దండలు మార్చుకున్నారు మధుసూదన్​, మానస. బాగ్​లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఈ ఆదర్శ వివాహానికి వేదికైంది.

నిరాడంబర వివాహ మహోత్సవమిది...
author img

By

Published : Nov 2, 2019, 7:09 PM IST

హైదరాబాద్​ బాగ్​లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఓ అరుదైన పెళ్లికి వేదికైంది. ఇద్దరు ప్రేమికులు వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచారు. రాష్ట్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఉద్యోగి మధుసూదన్ తన ప్రేయసి మానసను నిరాడంబరంగా వివాహమాడారు. ఈ ఆదర్శ వివాహానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరై యువ జంటను ఆశీర్వదించారు. తాను కూడా 37 సంవత్సరాల క్రితం ఎలాంటి ఆడంబరాలు లేకుండా ఆదర్శ వివాహం చేసుకున్నానని పెళ్లినాటి సంగతులు అందరితో పంచుకున్నారు. మంత్రి పెళ్లినాటి ఆదర్శ వివాహ ఆహ్వాన పత్రికను ఫ్రేముగా చేయించి జంటకు కానుకగా ఇచ్చారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శి వినయ్ కుమార్ నూతన దంపతులతో ప్రమాణం చేయించి దండలు మార్పించారు.

Intro:యువతీ యువ కుడు ఆదర్శ వివాహం చేసుకున్నారు

Body:హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో మధుసూదన్ మానస లో ఆదర్శ వివాహం చేసుకున్నారు... వివాహం చేసుకున్న జంట చేత సుందరయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శి వినయ్ కుమార్ ప్రమాణం చేయించారు ఈ జంటను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆశీర్వదించారు... ఈ వివాహ మహోత్సవం లో పడుకొన్న మంత్రి ఇ భోజనం చేసి వెళ్ళారు

Conclusion:ఆదర్శ జంట పలువురు ప్రశంసించారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.