ఇంటర్ విద్యార్థులకు కెరీర్ కౌన్సిలింగ్ కోసం ఈనెల 11న వెబినార్ నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. హిందీ మహా విద్యాలయ, ఐసీఏఐతో సంయుక్తంగా వెబినార్ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వెబినార్ లింకు వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు జలీల్ అన్నారు.
సీఏ, లైఫ్ సైన్సెస్, వొకేషనల్ తదితర విభాగాల్లో అవకాశాలపై చర్చించనున్నట్లు చెప్పారు. లాక్డౌన్ నేపథ్యంలో ఇంటర్ హాల్ టికెట్ నంబరునే సీఏ ఫౌండేషన్‌కు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించినట్లు ఐసీఏఐ కేంద్ర కౌన్సిల్ సభ్యుడు దయానివాస్ శర్మ తెలిపారు. ఐసీఏఐతో కలిసి ఇంటర్మీడియట్ కామర్స్ సిలబస్, కోర్సు కంటెంట్‌లో పలు మార్పులు తీసుకొచ్చే ఆలోచన ఉన్నట్లు జలీల్ వెల్లడించారు.
ఇదీ చూడండి : పదో తరగతి హాస్టల్ విద్యార్థులకు ప్రత్యేక అవకాశం