ఈ నెల 14 నుంచి 22 వరకు శాసనమండలి సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 11న మండలి ఛైర్మన్ ఎన్నిక ఉంటుందని మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. మండలి బీఎసీ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. అక్టోబరులో రెవెన్యూ బిల్లు తీసుకొచ్చే అవకాశముందని వెల్లడించారు. అదే నెలలో మళ్లీ అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. 2020లో వచ్చే బడ్జెట్ సమావేశాలు 21 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ నెల 24న సభాపతి విదేశీ పర్యటనకు వెళ్తారని పేర్కొన్నారు. దిల్లీ మాదిరిగా హైదరాబాద్ కానిస్టిట్యూషనల్ క్లబ్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.ఉదయం సభ ప్రారంభమైన వెంటనే ఆర్థిక మంత్రి హరీశ్‌రావు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అనంతరం సభ ఈనెల 14కు వాయిదా పడింది.
ఇవీ చూడండి: కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారమే ఉద్యోగాలు..