కేంద్రం పంపించిన కరోనా వ్యాక్సిన్లను(corona vaccines) ప్రజలకు వేస్తూ వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద సీఎం కేసీఆర్(cm kcr) ఫొటోలు పెట్టుకోవడమేంటని శాసన మండలి మాజీ ఛైర్మన్ స్వామి గౌడ్(swamy goud) మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం సొంత డబ్బా కొట్టుకుంటోందని వ్యాఖ్యానించారు. వ్యాక్సిన్ విషయంలో ప్రభుత్వం అవినీతి రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి ఒక్క డోసు కూడా కొనలేదని ఆయన అన్నారు. కానీ వ్యాక్సిన్ కేంద్రాల వద్ద మాత్రం కేసీఆర్ ఫొటో మాత్రమే పెట్టారని ధ్వజమెత్తారు.
రాష్ట్రానికి ఇప్పటిదాకా 71 లక్షల డోసులను కేంద్రం ఇచ్చిందని.. కానీ కేంద్రాల దగ్గర ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోలు ఎందుకు పెట్టలేదని స్వామి గౌడ్ ప్రశ్నించారు. వెంటనే అన్ని టీకా కేంద్రాల వద్ద మోదీ ఫొటోలు పెట్టాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: Trains Cancelled: 'ప్రయాణికుల్లేక పలు రైళ్లు తాత్కాలికంగా రద్దు'