ETV Bharat / state

Cotton: పత్తి కొనుగోళ్లపై గందరగోళం... జిన్నింగ్‌ రేట్లు పెంచాలని మిల్లర్ల ఒత్తిడి - Hyderabad District News

రాష్ట్రంలో పత్తి పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయడంపై గందరగోళం నెలకొంది. పత్తిని జిన్నింగ్‌ చేయడానికి సహకరించేది లేదని మిల్లుల యాజమాన్యాలు అడ్డం తిరగడంతో.. సీసీఐ కొనుగోలు కేంద్రాలు తెరచుకోలేదు. భారత పత్తి సంస్థ కేంద్రాలు తెరిస్తేనే మార్కెట్‌లో పోటీ ఏర్పడి ధర పెరుగుతుందని రైతులు కోరుతున్నారు.

Cotton
Cotton
author img

By

Published : Oct 19, 2021, 8:12 AM IST

రాష్ట్రంలో పత్తి పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయడంపై గందరగోళం నెలకొంది. పత్తిని జిన్నింగ్‌ చేయడానికి సహకరించేది లేదని మిల్లుల యాజమాన్యాలు అడ్డం తిరగడంతో.. ఇప్పటికీ ‘భారత పత్తి సంస్థ’(సీసీఐ) కొనుగోలు కేంద్రాలు తెరచుకోలేదు. అక్టోబరుకల్లా కేంద్రాలు తెరవాలని రాష్ట్ర ప్రభుత్వం గత జులైలోనే సీసీఐకి లేఖ రాసినా స్పందనే కరవైంది. ఈ సీజన్‌లో క్వింటా పత్తికి రూ.6025 చొప్పున మద్దతు ధర రైతులకివ్వాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం మార్కెట్‌లో అంతకన్నా ఎక్కువ ధర కొద్దిమంది రైతులు పొందుతున్నారు. కానీ తేమ ఎక్కువ ఉందన్న కారణంతో తక్కువ ధర చెల్లిస్తున్నారని, సీసీఐ కేంద్రాలు తెరిస్తేనే మార్కెట్‌లో పోటీ ఏర్పడి ధర పెరుగుతుందని రైతులు విన్నవిస్తున్నారు.

టెండర్లకు స్పందన కరవు...

సాధారణ పత్తి 5.50 క్వింటాళ్లను మిల్లులో జిన్నింగ్‌ చేస్తే ‘170 కిలోల’(బేలు) దూది బయటికి వస్తుంది. బేలుకు గతేడాది సీసీఐ రూ.1265 చొప్పున ఛార్జీలను మిల్లులకు చెల్లించింది. ఏపీలో బేలుకు రూ.1300 చొప్పున జిన్నింగ్‌ ఛార్జి ఖరారు చేశారని, తెలంగాణలోనూ అంతే ఇస్తామని ప్రకటించింది. ఈమేరకు టెండర్లు వేయాలని రెండుసార్లు నోటిఫికేషన్‌ జారీచేసింది. తెలంగాణలో 380 మిల్లులున్నా ఒక్కరూ టెండరు దాఖలు చేయలేదు. ‘పత్తిలో ఉండే తేమ ఆధారంగా జిన్నింగ్‌ చేసేటప్పుడు బరువు తగ్గుతుంది. ఒక్కోసారి ఒక్కోరకంగా దూది వస్తోంది. అలా ఇస్తే సీసీఐ తీసుకోవడం లేదు.. ఆ నష్టాలు మేం భరించాల్సి వస్తోంది’ అని మిల్లు యాజమానులు వాదిస్తున్నారు. వీరు టెండర్లు వేయకపోవడానికి అంతర్గతంగా మరికొన్ని కారణాలున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి విధానం కింద రాష్ట్రంలో జిన్నింగ్‌ మిల్లులు స్థాపిస్తే కరెంటు, ఇతర అంశాల్లో ప్రోత్సాహకాలు, రాయితీలిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ రాయితీల బకాయిలు రూ.500 కోట్లకు చేరినా ఇవ్వడం లేదని, అవి ఇచ్చేదాకా పత్తి కొనుగోలుకు సహకరించకూడదనే.., టెండర్లు వేయలేదని సమాచారం. ఇదంతా రాష్ట్ర మార్కెటింగ్‌శాఖకు తెలిపినా సమస్య పరిష్కారానికి కృషి చేయకుండా.. ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని జిన్నింగ్‌ మిల్లర్ల సంఘం నేతలు తెలిపారు.

ఇదీ చదవండి: Cm Kcr on Paddy Procurement: 'వర్షాకాలంలోనూ వరిధాన్యాన్ని సేకరిస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.