ETV Bharat / state

శౌచాలయాల నిర్మాణాల్లో అక్రమాలు.. నీరుగారిపోతున్న లక్ష్యం

ప్రజా మరుగుదొడ్ల నిర్మాణం పైసల వేటగా మారుతోంది. ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును.. ప్రతి రెండేళ్లకోసారి అధికారులు ముడుపుల వ్యవహారంగా మార్చుతున్నారు. రూ.కోట్లతో కొనుగోలు చేసిన ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ టాయిలెట్ల దుస్థితే అందుకు నిలువెత్తు సాక్ష్యం. హైదరాబాద్​ నగరవ్యాప్తంగా రెండు వేల ప్రాంతాల్లో ఏర్పాటైన 4వేల నిర్మాణాల్లో.. 50శాతం దుర్వాసన, వ్యర్థాలకు కేంద్రంగా మారాయి.

శౌచాలయాల నిర్మాణాల్లో అక్రమాలు.. నీరుగారిపోతున్న లక్ష్యం
శౌచాలయాల నిర్మాణాల్లో అక్రమాలు.. నీరుగారిపోతున్న లక్ష్యం
author img

By

Published : Jan 10, 2021, 7:48 AM IST

రాష్ట్ర రాజధానిలో ప్రజా మరుగుదొడ్ల సమస్యను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్‌ఎంసీకి రూ.65 కోట్ల నిధులు కేటాయించింది. 2 వేల చోట్ల మరుగుదొడ్లు ఏర్పాటు చేయగా.. నెల తిరగక ముందే అందులోని 50శాతం నిర్మాణాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇందుకు టెండరు విధానమే కారణమన్న ఆరోపణలొస్తున్నాయి. కేంద్ర కార్యాలయం వికేంద్రీకరణ పేరుతో జోనల్‌ కార్యాలయాలకు బాధ్యతలు అప్పగించి చేతులు దులిపేసుకుంది. దాని వల్ల ఒక్కో జోన్‌.. ఒక్కో రకం నిర్మాణాలను అందుబాటులోకి తెచ్చింది. కొన్ని చిన్నపాటి పాన్‌ డబ్బాల్లా, మరికొన్ని అట్టపెట్టెలతో కట్టిన పిట్టగూళ్లను తలపిస్తున్నాయి.

శౌచాలయాల నిర్మాణాల్లో అక్రమాలు
లోపల ఇలా...

ఎక్కడైనా అంతే..

ఖైరతాబాద్‌, శేరిలింగంపల్లి జోన్లలో ప్లాస్టిక్‌ పీచుతో చేసినవి ఏర్పాటు చేయగా.. అవి విరుగుపోతున్నాయి. లోయర్‌ట్యాంక్‌బండ్‌లో ప్రతి 100మీటర్లకు ఓ మరుగుదొడ్డి ఏర్పాటు చేయగా, అవన్నీ ఇప్పటికే ధ్వంసమయ్యాయి. ఖైరతాబాద్‌ విద్యుత్తు సౌధ, ఉప్పల్‌, అత్తాపూర్‌, మెహిదీపట్నం, చార్మినార్‌, చాంద్రాయణగుట్ట, తదితర ప్రాంతాల్లో మరింత దుర్భర పరిస్థితి నెలకొంది.ఏటా నిర్వహణ రూపంలో ఖర్చు చేయనున్న రూ.40కోట్లు సైతం బూడిదలో పోసినట్లేనని విమర్శలొస్తున్నాయి.

వింత లెక్క..

జీహెచ్‌ఎంసీ గతంలో ఒక మరుగుదొడ్డిని ఒకటిగానే లెక్కించేది. ఇప్పుడు రెండుగా చెబుతోంది. ఎలాగంటే.. స్త్రీ, పురుషులకు వేర్వేరు సౌకర్యాలు ఉన్నందున, రెండు నిర్మాణాలుగా పరిగణిస్తామని అంటోంది. ఆ లెక్కన 2014 ప్రాంతాల్లో 4028 ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ టాయిలెట్లను ఏర్పాటు చేశామంటోంది.

శౌచాలయాల నిర్మాణాల్లో అక్రమాలు
లెక్కలు ఇలా...

ఇదీ చూడండి: ఆరోగ్యంపై దృష్టిపెట్టిన మహిళలు.. జిమ్​లలో కసరత్తులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.