ETV Bharat / state

వర్షాల నేపథ్యంలో బస్తీల్లో పర్యటించిన కార్పొరేటర్ ప్రకాశ్ గంగపుత్ర

హైదరాబాద్ గుడిమల్కాపూర్ కార్పొరేటర్ బంగారి ప్రకాశ్ గంగపుత్ర భారీ వర్షాల నేపథ్యంలో డివిజన్​లో పర్యటించారు. ఇటీవలే కురిసిన ఎడతెరిపి లేని వానలకు ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు.

వర్షాల నేపథ్యంలో బస్తీల్లో పర్యటించిన కార్పొరేటర్ ప్రకాశ్ గంగపుత్ర
వర్షాల నేపథ్యంలో బస్తీల్లో పర్యటించిన కార్పొరేటర్ ప్రకాశ్ గంగపుత్ర
author img

By

Published : Sep 18, 2020, 10:17 AM IST

హైదరాబాద్ కార్వాన్ నియోజకవర్గ పరిధి గుడిమల్కాపూర్ డివిజన్​లో కార్పొరేటర్ బంగారి ప్రకాశ్ గంగపుత్ర పర్యటించారు. ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాలను అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ విష్ణువర్ధన్ రెడ్డితో కలిసి కార్పొరేటర్ సందర్శించారు.

గజం స్థలం కూడా..

తెరాస ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో గజం స్థలం కూడా కబ్జా కాకుండా కాపాడిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని గుడిమల్కపూర్ కార్పొరేటర్ బంగారి ప్రకాశ్ గంగపుత్ర పేర్కొన్నారు. గత ప్రభుత్వాల హయాంలో చెరువులు, కుంటలు కుడా కబ్జా అయ్యాయని ఆయన గుర్తు చేశారు.

బల్దియా డ్రైనేజీలు తట్టుకోలేవు..

24 గంటల పాటు ఏకధాటిగా పడిన వర్షానికి 9 సెంటిమీటర్ల వర్షం కురిసిందన్నారు. ఈ నేపథ్యంలో బల్దియా డ్రైనేజీలు తట్టుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. 45 నిమిషాల్లో 9 సెంటీమీటర్ల వర్షం కురిసిందంటే నగర రోడ్లు, సివరేజీల పరిస్థితిని ఊహించవచ్చన్నారు. బస్తీల్లో నాలాలకు సంబంధించిన అంశాలు, ఇతర మౌలిక సదుపాయాల మరమ్మతులకు వెంటనే తమను సంప్రదించాలని ప్రకాశ్ సూచించారు.

ఇవీ చూడండి : తెలంగాణ సాయుధ పోరాటం మతకోణంలో చూడరాదు : బృందాకారత్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.