హైదరాబాద్ నగరంలో కరోనా విలయతాండవం చేస్తోంది. నగరంలో ఏ మూలన చూసినా కరోనా బాధితులే ఉన్నారు. గాజులరామారం జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ రవిందర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. అల్లాపూర్ డివిజన్‌లో ఎనిమిది మందికి కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో ఐదుగురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఐటీ విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌కు పాజిటివ్ వచ్చింది. ఐటీ విభాగం మూసివేసి కార్యాలయాన్ని శానిటైజ్ చేశారు.
కుత్బుల్లాపూర్‌లో 21 కేసులు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిజాంపేట్ లోని వివిధ అపార్టుమెంట్లలో నాలుగు కేసులు నమోదవగా.. గాజులరామరం పరిధిలో ఇద్దరు మహిళలకు నిర్ధరణ అయింది. జీడీమెట్ల పరిధిలోని వివిధ కాలనీల్లో అయిదు కేసులు... సుచిత్రలో మూడు కేసులు నమోదయ్యాయి. చింతల్‌లో మరో ఇద్దరికి కరోనా సోకింది. కుత్బుల్లాపూర్‌లో ముగ్గురికి.. భౌరంపేట, జగద్గిరిగుట్ట, కొంపల్లి, షాపూర్‌నగర్‌లో ఒక్కో కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో నేడు 21 కేసులు వచ్చాయని అధికారులు పేర్కొన్నారు.
8 మంది బీడీఎల్ కార్మికులకు
శంషాబాద్‌లో ముగ్గురికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలంలో ఇద్దరికి వైరస్ సోకినట్లు అధికారులు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని శేరిగూడలో మరొక్కరికి కరోనా పాజిటివ్ వచ్చింది. పటాన్ చెరు మండలం బీడీఎల్ పరిశ్రమలో పనిచేసే ఎనిమిది మంది కార్మికులకు వైరస్ నిర్ధరణ అయినట్లు అధికారులు వెల్లడించారు. మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలంలో ఇద్దరికి కరోనా సోకింది.
ఇదీ చదవండి: హరితహారానికి 'ఆరో' మెట్టు.. రేపు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్