ETV Bharat / state

నెల రోజుల్లో పది రెట్లు..కరోనా విలయ తాండవం.. - oronavirus cases in India by state

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయ తాండవం సృష్టిస్తోంది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే కేసులు పది రెట్లు పెరిగాయి. చైనాకు చేరువయ్యే దిశగా గణాంకాలు నమోదవుతున్నాయి. ప్రస్తుత తీరును బట్టి మరో వారం లోపు చైనాతో సమానంగా కేసుల సంఖ్య నమోదయ్యే అవకాశం కనిపిస్తోందని నిపుణులు భావిస్తున్నారు.

కరోనా విలయం..  నెల రోజుల్లో పది రెట్లు..
Corona William .. Ten times a month ..
author img

By

Published : May 11, 2020, 7:51 AM IST

నెల రోజుల్లో దేశవ్యాప్తంగా పది రెట్లు కరోనా కేసులు పెరిగిపోయాయి. చైనాకు చేరువయ్యే దిశగా మన దేశంలో గణాంకాలు నమోదవుతున్నాయి. ఏప్రిల్‌ 10న కేసుల సంఖ్య 6 వేలు దాటగా మే 10 (ఆదివారం) నాటికి 62,000ను మించాయి. మరణాలు 2 వేలు దాటాయి. నెల రోజుల్లో కేసులు, మరణాలు 10 రెట్లు, కోలుకునే రేటు 40 రెట్లు వృద్ధి చెందాయి. ప్రస్తుత తీరును బట్టి మరో వారం లోపు చైనాతో సమానంగా కేసుల సంఖ్య నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. చైనా కేసులు 82వేలను మించాయి. ప్రస్తుతం భారత్‌ ప్రపంచంలో 14వ స్థానానికి చేరింది.

24 గంటల్లో 3,277 కొత్త కేసులు నమోదు

గత 24 గంటల్లో దేశంలో 3,277 కొత్త కేసులు వచ్చాయి. 1,511 మంది కోలుకున్నారు. 128 మరణాలు నమోదయ్యాయి. రికవరీ రేటు శనివారం 29.91% ఉండగా ఆదివారం నాటికి 30.75%కి చేరింది. ఇదే సమయంలో మరణిస్తున్నవారి శాతం 3.32 నుంచి 3.35కి చేరింది. గత 24 గంటల్లో 10 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి కొత్త కేసులు రాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

అధిక సంఖ్యలో పరీక్షలు

దేశంలో కరోనా పరీక్షల సంఖ్య 16,09,037కి చేరింది. ప్రతి 25.56 మందిలో ఒకరికి పాజిటివ్‌ వచ్చినట్లు (3.91%) లెక్కలు చెబుతున్నాయి. గత 24 గంటల్లో 85,824 పరీక్షలు నిర్వహించారు.

ఇప్పటివరకూ ఒక్కరోజులో నిర్వహించిన గరిష్ఠ పరీక్షలు ఇవే. 24 గంటల్లో 75% మరణాలు మహారాష్ట్ర (48), గుజరాత్‌ (23), మధ్యప్రదేశ్‌ (15), పశ్చిమబెంగాల్‌ (11)లోనే సంభవించాయి. మిజోరంలో ఉన్న ఏకైక

బాధితుడు కోలుకున్నారు. కొవిడ్‌ రహితంగా ఉన్న గోవా, మణిపుర్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, అండమాన్‌ నికోబార్‌ల సరసన మిజోరం చేరినట్లయింది. మహారాష్ట్రలో కేసులు 20,000 దాటిపోయాయి.

వలస కార్మికులు దిల్లీ వీడి వెళ్లవద్దు: కేజ్రీవాల్‌

త్వరలో లాక్‌డౌన్‌ ముగుస్తుందని దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ తెలిపారు. దీని దృష్ట్యా వలస కార్మికులెవరూ రాజధాని నగరాన్ని వీడి వెళ్లవద్దని కోరారు. లాక్‌డౌన్‌ ముగియగానే పరిస్థితులు కుదుట పడతాయని, పనులు మునుపటిలా లభిస్తాయని చెప్పారు. వలస కార్మికుల పరిస్థితి తనను కలచివేస్తోందన్నారు. తమంతట తాముగా దిల్లీ నుంచి ప్రయాణం కావద్దని వారికి విజ్ఞప్తిచేశారు. దిల్లీలో 6923 మంది బాధితుల్లో 2069 మందినే ఆసుపత్రుల్లో చేర్చాల్సి వచ్చిందని చెప్పారు.

ఉజ్జయినిలో మరణాలు 19%

  • మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కరోనా మృతుల సంఖ్య 89కి చేరింది. ఇండోర్‌ సమీపంలోని ఉజ్జయినిలో బాధితుల్లో 19% మంది ప్రాణాలు కోల్పోతుండడం ప్రమాద ఘంటికల్ని మోగిస్తోంది. జాతీయ సగటు (3.35%)తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ.
  • త్రిపురను కరోనా రహితంగా ప్రకటించిన కొద్దిరోజుల్లోనే అక్కడ అకస్మాత్తుగా కేసులు పెరిగాయి. కేవలం వారం వ్యవధిలో 130 మంది పాజిటివ్‌గా చేరారు. ఈ కేసులన్నీ బీఎస్‌ఎఫ్‌ బెటాలియన్లకు చెందినవారివే కావడం విశేషం.
  • పశ్చిమబెంగాల్‌లో 14 మంది ఒక్కరోజులో మృత్యువాత పడ్డారు. వీరిలో 10 మంది కోల్‌కతాలోనే చనిపోయారు. 153 కేసులు కొత్తగా వెలుగుచూశాయి.

అహ్మదాబాద్‌లో 334 మంది సూపర్‌ స్ప్రెడర్లు

గుజరాత్‌లో అత్యధిక కేసులున్న అహ్మదాబాద్‌ నగరంలో కరోనా విస్తృత వ్యాప్తి వాహకులు (సూపర్‌ స్ప్రెడర్లు)గా ఇంతవరకు 334 మందిని గుర్తించారు. దీని కారణంగానే కిరాణా, కూరగాయల దుకాణాలనూ 15వ తేదీ వరకు మూసివేయాల్సిందిగా ఆదేశించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

కూరగాయల విక్రేతలు, కిరాణా దుకాణాలవారు, పాలు అమ్మేవారు, పెట్రోలు బంకుల సిబ్బంది, చెత్త సేకరించేవారు తమ పని స్వభావం రీత్యా కరోనా బారిన పడేందుకు, సూపర్‌ స్ప్రెడర్లుగా మారేందుకు అవకాశాలున్నాయని పేర్కొన్నాయి. ఈ కోవలోకి రావచ్చని అనుమానిస్తున్న 14,000 మందిని రాబోయే మూడు రోజుల్లో పరీక్షించనున్నారు. ఇంతవరకు ఇలాంటి 3817 మంది నమూనాలను సేకరించి విశ్లేషిస్తే వారిలో 334 మంది కరోనా పాజిటివ్‌గా తేలారు..!

ఇదీ చూడండి: ప్రధానికి ముఖ్యమంత్రి ఏం చెప్పబోతున్నారు..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.