ETV Bharat / state

కొవిడ్​ ఆస్పత్రుల ఆవరణలోని​ గాలిలో కరోనా వైరస్​

author img

By

Published : Jan 5, 2021, 5:27 PM IST

Updated : Jan 5, 2021, 8:57 PM IST

corona virus in air in hdyerabad
కరోనా ఆస్పత్రుల ఆవరణలోని​ గాలిలో కరోనా వైరస్​

15:08 January 05

కొవిడ్​ ఆస్పత్రుల ఆవరణలోని​ గాలిలో కరోనా వైరస్​

కరోనా వైరస్ గాలిలో దాదాపు 2 గంటల సేపు ఉంటుందని సీసీఎంబీ ప్రకటించింది.  గతంలో మురుగునీటిలో వైరస్​పై పరిశోధనలు చేసిన సీసీఎంబీ.. తాజాగా గాలిలో వైరస్ వ్యాప్తిపై పరిశోధించింది. హైదరాబాద్​లోని 3 , చండీగఢ్​లోని 3 ఆస్పత్రుల్లో గాలి శాంపిల్స్​ను సేకరించిన సీసీఎంబీ శాస్త్ర వేత్తలు... వాటికి ఆర్​టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. 

లక్షణాలు ఉన్న వైరస్ బాధితుల ద్వారా గాలిలోకి వైరస్ చేరుతుందని గుర్తించారు. లక్షణాలు ఉండి, రోగులు ఒకే గదిలో ఎంతసేపు ఉన్నారు అన్న దానిపై ఆధారపడి వైరస్ వ్యాప్తి ఉంటుందని ప్రకటించారు. గాలిలో వైరస్ సుమారు 2 మీటర్ల దూరం, 2 గంటల పాటు ఉంటుందని గుర్తించారు. అయితే లక్షణాలు లేని వారి ద్వారా గాలిలోకి వైరస్ చేరదని పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో కొవిడ్, నాన్ కొవిడ్ సేవలకు వేరు వేరు వార్డులను కేటాయించి చికిత్సలు అందిస్తోండటం ఉపయోగపడుతోందన్నారు.  మాస్క్ ల వినియోగం ద్వారా గాలిలో ఉన్న వైరస్ ద్వారా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా చూసుకోవచ్చని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: ఈ నెల 13నే భారత్​లో వ్యాక్సినేషన్​ షురూ!

Last Updated : Jan 5, 2021, 8:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.