ETV Bharat / state

ర్యాపిడ్‌ పరీక్షల్లో 17 శాతం మందిలో కరోనా వైరస్‌

హైదరాబాద్​ నగరంతోపాటు శివార్లలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ర్యాపిడ్‌ పరీక్షలు చేయించుకుంటున్నవారిలో 17 శాతం మందిలో పాజిటివ్‌ నిర్ధరణ అవుతోంది. హైదరాబాద్‌ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని 79 పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 17,153 మంది నుంచి నమూనాలు సేకరించగా అందులో 2,811 మందికి వైరస్‌ తేలింది. గురువారం 3 వేల మందికి పైగా ఈ పరీక్షలు చేయగా 619 మందికి కరోనా నిర్ధరణ అయింది.

Corona virus in 17% of rapid tests
ర్యాపిడ్‌ పరీక్షల్లో 17 శాతం మందిలో కరోనా వైరస్‌
author img

By

Published : Jul 17, 2020, 6:11 AM IST

ర్వాపిడ్‌ పరీక్షల్లో నిర్ధరణ కాకపోతే అతనికి కరోనా లేనట్లు చెప్పలేం. కొన్నిసార్లు లక్షణాలు ఉన్నా నెగెటివ్‌ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటివారు ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష చేసుకోవాలి. నోరు, ముక్కు నుంచి స్వాబ్‌ను తీసి ఈ పరీక్ష చేస్తారు. వాస్తవానికి 12 నుంచి 24 గంటల్లో నివేదిక రావాలి. రోగుల సంఖ్య పెరుగుతుండటం వల్ల కొన్నిసార్లు అయిదు రోజులకూ తెలియడం లేదు. ఫలితాలు వచ్చేలోపు కొందరి ఆరోగ్యం విషమిస్తోంది.

అన్ని ప్రాంతాల్లోనూ కేసులు...

గురువారం గ్రేటర్‌లో 788 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 224, మేడ్చల్‌లో 160మంది కరోనా బారినపడ్డారు. 10 మంది చనిపోయారు. మల్కాజిగిరి సర్కిల్‌ పరిధిలో 64 మంది, ఉప్పల్‌ పరిధిలో 54.. ఖైరతాబాద్‌, సోమాజిగూడ, అమీర్‌పేట, సనత్‌నగర్‌లలో 68 మంది, జూబ్లీహిల్స్‌, యూసుఫ్‌గూడ, ఎర్రగడ్డ, రహ్మత్‌నగర్‌, వెంగళ్‌రావునగర్‌లో 58 మందికి కరోనా సోకింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఇతర సమస్యలు ఉంటే 1075, 104తోపాటు టోల్‌ఫ్రీ 1800 599 4455కు సంప్రదించాలని సూచిస్తున్నారు.

కలెక్టరేట్‌లో 15 మందికి కరోనా

హైదరాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌లో కరోనా కలకలం రేగింది. ఇప్పటివరకు సుమారు 15 మందిలో వైరస్‌ నిర్ధారణ కావడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రధాన కార్యాలయంలోని అంతస్తులను శుభ్రపరిచారు. కరోనా నిర్ధారణ అయిన సిబ్బందిని హోం క్వారంటైన్‌లో ఉంచారు. తాజాగా కలెక్టర్‌ డ్రైవర్‌కు వైరస్‌ ఉన్నట్లు తేలడంతో కలెక్టర్‌కు పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా కలెక్టర్‌ విధులకు హాజరుకావడం లేదు.

ఇదీ చూడండి:- రాజధానిలో రోజువారీ కేసుల కన్నా రికవరీలే ఎక్కువ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.