ఏపీలోని విజయనగరం జిల్లాలో డెల్టా వేరియంట్ తొలి కేసు నమోదైంది. గంట్యాడ మండలం పెనసాం గ్రామానికి చెందిన 23 ఏళ్ల మహిళకు సోకినట్లు నిర్ధారించారు. ఈ దంపతులు విజయనగరంలో నివాసం ఉంటున్నారు. గత నెల 17న కొవిడ్ పరీక్షలు చేయించుకోగా ఇద్దరికీ పాజిటివ్ వచ్చింది. సొంతూరు పెనసాం వెళ్లిపోయి హోమ్ ఐసోలేషన్‌లోనే ఉన్నారు. 31న మళ్లీ కొవిడ్ పరీక్షలు చేయించుకోగా... భర్తకు నెగెటివ్ వచ్చింది. ఆమెకు మాత్రం మళ్లీ పాజిటివ్ అని తేలింది. ఆమె నమూనాలను హైదరాబాద్ పంపించగా.. డెల్టా వేరియంట్ అని నివేదిక వచ్చింది.
ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగానే ఉందని.. కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్యంగానే ఉన్నారని జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారిణి ఎస్‌వీ రమణకుమారి తెలిపారు. డెల్టా ప్లస్‌తో పోలిస్తే డెల్టా వేరియంట్ తీవ్రత ఏమీ ఉండదని, ఎవరూ భయాందోళన చెందాల్సిన పని లేదని ఆమె పేర్కొన్నారు.
ఇదీ చూడండి:Doctors Day: ఆ వార్త చెప్పడం బాధనిపించేది..!