విద్యుత్ సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ను ఆదేశించారని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు. విద్యుత్ ఉద్యోగులను, సిబ్బందిని ఫ్రంట్‌లైన్ వారియర్లుగా గుర్తించి వారికి వ్యాక్సిన్ ఇప్పించాలన్న విజ్ఞప్తికి సీఎం సానుకూలంగా స్పందించారని ప్రభాకర్‌రావు వెల్లడించారు. వ్యాక్సిన్ వేయడంపై వీలైనంత త్వరగా సంబంధిత అధికారులతో చర్చించి వ్యాక్సినేషన్‌ను ప్రారంభించాలని సీఎస్‌ను సీఎం ఆదేశించారని సీఎండీ వివరించారు.
విద్యుత్ శాఖలో 52 వేలకు పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. త్వరలోనే వీరందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులకు, సిబ్బందికి వ్యాక్సినేషన్ వేసేందుకు అంగీకరించిన సీఎం కేసీఆర్‌కు ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇదీ చదవండి : భూముల సమగ్ర సర్వేపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష