ETV Bharat / state

CORONA VACCINE: భాగ్యనగరంలో మూతపడిన సగం కరోనా టీకా కేంద్రాలు

మొన్నటి వరకు కరోనా (corona) అంటే మహానగర ప్రజలు వణికిపోయారు. ఎక్కడ వైరస్‌ బారినపడితే ప్రాణాల మీదకు వస్తుందోనని ఆందోళన చెందారు. అదే జనం ఇప్పుడు కరోనా టీకా వేయించుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఇదే సమయంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) ఆధ్వర్యంలోని టీకా కేంద్రాలు కూడా మూతపడుతున్నాయి. ఈ కేంద్రాల్లో పని చేసే ప్రైవేటు సిబ్బందికి జీతాలు ఇవ్వకపోడంతో వారు టీకా వేసుకున్న వారి వివరాలతో కూడిన ల్యాప్‌ట్యాప్‌లను పట్టుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. దీంతో మహానగరంలో టీకాలు వేసే కార్యక్రమం చాలా చోట్ల ఆగిపోయింది.

CORONA VACCINE
CORONA VACCINE: భాగ్యనగరంలో మూతపడిన సగం కరోనా టీకా కేంద్రాలు
author img

By

Published : Oct 13, 2021, 11:58 AM IST

గత నాలుగైదు నెలలుగా రాష్ట్రంలో కరోనా వైరస్‌ (corona virus) తీవ్రత తగ్గింది. రోజూ 500 వరకు కేసులు వస్తుండగా రాజధాని పరిధిలో 150 నమోదవుతున్నాయి. కేసుల సంఖ్య తగ్గడంతో చాలామంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మూడొంతుల మంది మాస్కులు కూడా ధరించడం లేదు. కరోనా వచ్చినా మనకేం కాదన్న ధీమాతో చాలా మంది కొద్ది రోజులుగా టీకా వేసుకోవడానికి కూడా ముందుకు రావడం లేదు. మహానగరంలో మూడు నెలల్లో అందరికీ టీకాలు వేసే కార్యక్రమాన్ని పూర్తి చేయడం కోసం వంద టీకా కేంద్రాలను బల్దియా అధికారులు ఏర్పాటు చేశారు. ప్రైవేటు సంస్థలకు ఈ కేంద్రాల నిర్వహణ బాధ్యత అప్పగించారు. మొదట్లో అన్ని జనంతో కిటకిటలాడేవి. నిర్వాహకులు తమ కేంద్రాల్లో పని చేసే అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు కూడా ఇవ్వడం మానేశారు. దీంతో ఈ సిబ్బంది అప్పటి వరకు ఎంతమందికి టీకాలు వేశారన్న సమాచారంతో ఉన్న ల్యాప్‌ట్యాప్‌లను కూడా తీసుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. దీంతో మెహిదీపట్నం లాంటి ముఖ్యమైన ప్రాంతాల్లో టీకా కేంద్రాలు మూతపడ్డాయి. దాదాపు 50 కేంద్రాల వరకు మూతపడినట్లు చెబుతున్నారు. బల్దియా అధికారులు జోక్యం చేసుకుని సిబ్బందికి మూడు నెలల జీతాలు చెల్లించేలా చేసి తిరిగి ఈ కేంద్రాలను తెరిపించే ఏర్పాట్లు చేయడం లేదు.

...

మధ్యాహ్నానికే తాళం

హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో కోటి మందికిపైగా జనాభా ఉన్నారని సర్కార్‌ లెక్కలు చెబుతున్నాయి. ఇంతవరకు 72 లక్షలమంది మాత్రమే టీకాలు వేయించుకున్నారు. అంటే ఇంకా 28 లక్షలమంది కనీసం మొదటి డోసు టీకా వేయించుకోకుండా మాస్కులు ధరించకుండా బయట తిరిగేస్తున్నారు. రెండు డోసులు వేయించుకున్న వారి సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది. మహానగరంలో 50 కేంద్రాలు పని చేస్తుంటే రోజువారీగా మంగళవారం డోసులు వేయించున్న సంఖ్య 43 వేలమంది మాత్రమే. డోసులు ఉన్నా జనం రాకపోవడంతో కొన్ని కేంద్రాలు మధ్యాహ్నం నాటికే మూతపడుతున్నాయి. కరోనా ముప్పు తొలగిపోలేదని మరోమూడు నెలలు జాగ్రత్తగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కోరుతున్నాకూడా చాలా మంది నిర్లక్ష్యాన్ని వీడటం లేదు. ఇప్పటికీ గాంధీ ఆస్పత్రిలో 200 మంది కరోనా రోగులు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికైనా జనంలో అధికారులు చైతన్యం తెచ్చి టీకాలను పెద్దఎత్తున వేయాలని అనేకమంది కోరుతున్నారు.

...
...

ఇదీ చదవండి: Saddula Bathukamma 2021: గడగడపనా పూల సంబురం.. బతుకు పండుగకు నీరాజనం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.