మన దేశంలో తయారైన కొవిడ్ వ్యాక్సిన్ ఎంతో సురక్షితమని హైదరాబాద్ ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఛైర్మన్ నాగేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని స్పష్టం చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో కొవిడ్-19 వ్యాక్సినేషన్ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీఎంహెచ్వో స్వరాజ్యం లక్ష్మి హాజరయ్యారు.
ఏఐజీ ఆస్పత్రి ఛైర్మన్ నాగేశ్వర్ రెడ్డి టీకా వేయించుకున్నారు. వ్యాక్సిన్ వేసుకోవడానికి అందరూ ముందుకు రావాలని కోరారు. రోజుకి రెండు వందల నుంచి 500 మందికి వ్యాక్సిన్ ఇస్తున్నామన్నారు.
ఇదీ చదవండి: ప్రేమోన్మాదం పెచ్చుమీరుతోంది... కపట నాటకంతో కత్తిదూస్తోంది!