హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలో సుమారు 50 మంది ఖురేషీలకు (మాంసం వ్యాపారులు)కు మంగళవారం నిజామియా టీబీ ఆసుపత్రిలో కరోనా టెస్టులు నిర్వహించారు. మాంసం వ్యాపారులు స్వచ్ఛందంగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. మాంసం వ్యాపారులు కరోనా పరీక్షలు చేయించుకుంటే వారి దుకాణాలకు వచ్చే కొనుగోలు దారులకు ఈ మహమ్మారి వ్యాపించకుండా ఉంటుందని పేర్కొన్నారు.
అంతేకాకుండా చార్మినార్, పత్తర్ గట్టి ప్రాంతాల్లో సుమారు 400 తోపుడు బండ్ల వ్యాపారులు వ్యాపారం కొనసాగిస్తున్నారని వారు కుడా ప్రభుత్వం ఉచితంగా నిర్వహించే పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించుకోవాలని ఎంపీ కోరారు. అలాగే టిఫిన్ సెంటర్ యజమానులు, టాక్సీ ఆటో డ్రైవర్లు కూడా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలన్నారు.
ఇదీ చూడండి: 30 ఏళ్ల ముందస్తు ప్రణాళికతో రిజర్వాయర్ నిర్మించాం: కేటీఆర్