ETV Bharat / state

సకాలంలో పరీక్షలు చేయించుకోని కరోనా అనుమానితులు - కరోనా అనుమానితుల నిర్లక్ష్యం

కరోనా విషయంలో కొందరి అలక్ష్యం ప్రాణాల మీదికి తెస్తోంది. కొద్ది రోజులుగా జ్వరం, దగ్గు, జలుబు తదితర సమస్యలతో బాధపడుతున్నా సకాలంలో నిర్ధరణ పరీక్ష చేయించుకోవడం లేదు. జ్వరానికి పారాసిట్‌మాల్‌ వాడి కొన్ని రోజులు మిన్నకుండి పోతున్నారు. ఆ లోపు శరీరంలో వైరస్‌ విస్తరించి శ్వాస కష్టంగా మారడం, ఆ తర్వాత నిమోనియాతో గంటల వ్యవధిలోనే చనిపోతున్నారు.

సకాలంలో పరీక్షలు చేయించుకోని కరోనా అనుమానితులు

author img

By

Published : Jul 10, 2020, 9:14 AM IST

హైదరాబాద్‌ ఖైరతాబాద్‌ ఆనంద్‌నగర్‌ కాలనీకి చెందిన వ్యక్తికి కొద్దిరోజుల క్రితం ఊపిరి తీసుకోవడం కష్టమైంది. రాత్రికి రాత్రి ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ తిరిగినా పడక లభించలేదు. చివరికి నిమ్స్‌లో చేరాడు. అప్పటికే వ్యాధి ముదరడం వల్ల కాసేపటికే చనిపోయాడు. పరీక్ష చేస్తే కరోనా పాజిటివ్‌గా తేలింది. వారంపాటు వైరస్‌ లక్షణాలు ఉన్నాయని చెబుతున్నారు. ముందుగానే మేల్కొని పరీక్ష చేయించుకుంటే ప్రాణం నిలిచి ఉండేదని వైద్యులు తెలిపారు.

రాజేంద్రనగర్‌ మండలానికి చెందిన మహిళకు కరోనా సోకింది. అది గుర్తించక ఆలస్యంగా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. అప్పటికే నిమోనియాతో ఊపిరితిత్తులు పని చేయడం లేదు. సకాలంలో పరీక్ష చేయించుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు.

సాధారణ జ్వరంగా భావిస్తూ..

నగరంలో ప్రస్తుతం 20 వేలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఐదు వేల మంది వరకు ఉన్నారు. మిగిలిన వారు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. వైరస్‌ అధికమై శరీరంలోని కొన్ని అవయవాలు స్పందించని స్థితిలో అనేకమంది పడకలపై కనిపిస్తున్నారు. దీనిపై వైద్యులు ఆరా తీస్తే చాలా మంది కరోనా లక్షణాలు ఉన్నా పరీక్ష చేయించుకోవడానికి ముందుకు రాకపోవడమే కారణమని తేలింది.

తమకు వచ్చింది సాధారణ జ్వరంగానే కొందరు భావించగా.. అధికంగా పని చేయడం వల్లనో, ఇతర కారణాల వల్లో వచ్చిందని మరికొందరు తమను తామే సమాధానపర్చుకున్నారు. దీంతో శరీరంలో వైరస్‌ ఉద్ధృతంగా మారి ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తోంది. ఒక్కసారిగా శ్వాస అందక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పరిస్థితి విషమంగా మారిన తర్వాత ఆసుపత్రుల వైపు పరుగులు తీస్తున్నారు. గత నెల రోజుల్లో ఇలా చనిపోయిన రోగుల సంఖ్య అధికంగా ఉంది. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, వాసన కోల్పోవడం వంటి లక్షణాలున్నప్పుడు తక్షణం పరీక్షలు చేయించుకుంటే ఇబ్బందే ఉండదని వైద్యులు చెబుతున్నారు. పాజిటివ్‌ వచ్చినా పెద్దగా లక్షణాలు లేకపోతే ఇంట్లోనే ఉండి వైద్యుల పర్యవేక్షణలో 14 రోజులు చికిత్స తీసుకుంటే సరిపోతుంది.

అయినా విధులకు హాజరై..

కొంతమంది కరోనా లక్షణాలున్నా విధులకు హాజరవుతున్నారు. ఇటీవల జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో జ్వరంతో నాలుగు రోజులపాటు విధులకు హాజరైన ఒక ఉద్యోగి వల్ల అనేక మందికి వైరస్‌ సోకింది. అనేకచోట్ల ఇదే విధమైన పరిస్థితి. ఆరోగ్యం చెడిపోయిన తరువాతే పరీక్షలు చేయించుకుని కరోనా అని తేలిన తరువాత ఆసుపత్రుల్లో చేరిన ఉద్యోగులు ఎంతోమంది ఉన్నారు. వీరి నిర్లక్ష్యం వల్ల సహచరులు బాధితులుగా మారాల్సి వస్తోంది.

లక్షణాలుంటే పరీక్ష చేయించుకోవాలి

రెండు, మూడు రోజులు జ్వరం తగ్గకపోయినా, ఇతరత్రా లక్షణాలు ఉన్నా తక్షణం కరోనా పరీక్ష చేయించుకోవాలి. పాటిజివ్‌ వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. లక్షణాలు అధికంగా ఉంటేనే ఆసుపత్రిలో చేరాలి. లేనిపక్షంలో ఇంట్లోనే ఉండి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుని ఆరోగ్యవంతులు కావచ్చు.

-డాక్టర్‌ సుజిత్‌, ఫిజీషియన్‌

ఇవీ చూడండి: కీలక నిర్ణయం: ఇంటర్ ద్వితీయంలో ఫెయిలైన వారంతా ఉత్తీర్ణులే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.