ETV Bharat / state

కరోనా సోకితే జేబుకు చిల్లులే.. ప్రైవేటు వైద్యానికి లక్షలు.! - కోరనా ప్రైవేటు వైద్యం

కరోనా మహమ్మారి పేదల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. తీవ్ర లక్షణాలు ఉంటేనే గానీ ఆస్పత్రిలో చికిత్స ఇవ్వబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇష్టారీతిన ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రైవేటులో కరోనా చికిత్స ఫీజుపై రెగ్యులేటరీ అథారిటీ ఉంటేనే మేలు జరుగుతుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Corona Private Medicine treatment Bills in lakhs
కరోనా ప్రైవేటు వైద్యం.. లక్షల్లో బిల్లులు
author img

By

Published : Jun 14, 2020, 7:04 AM IST

ప్రైవేటు వైద్యం అంటేనే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అయినా సర్కారు దవాఖానాలనపై ఉన్న అపనమ్మకంతో ఏళ్లుగా ప్రజలు ప్రైవేటును ఆశ్రయిస్తున్నారు. కరోనా సమయంలో మాత్రం ప్రభుత్వం పూర్తిగా గాంధీలోనే చికిత్స అందించింది. అయితే ప్రస్తుతం అత్యవసరమైతే గానీ అసుపత్రికి రావొద్దని ప్రభుత్వం తేల్చిచెప్పింది. మరోవైపు ప్రైవేటు ఆసుపత్రులకు కరోనా చికిత్సలకు అనుమతి ఇచ్చింది. ప్రైవేటు వైపు చూస్తున్న ప్రజలకు అక్కడి బిల్లులు చుక్కలు చూపెడుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 300 మంది ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. వీరు ఒక్క రోజులోనే రెండు నుంచి మూడు లక్షలు చెల్లించగా... కొంత మందికి 15 నుంచి 30 లక్షల వరకు ఛార్జ్‌ చేస్తున్నారని సమాచారం. రానున్నది వర్షాకాలం.. నిత్యం జలుబు, దగ్గు వంటివి సహజంగానే పెరుగుతాయి. కరోనానేమో అన్న అనుమానంతో ప్రజలు ప్రైవేటు ఆసుపత్రుల వైపు పరుగులు పెట్టే అవకాశం ఉంది. అదే జరిగితే అక్కడ దోపిడీని అరికట్టగలమా అని సర్వత్రా చర్చ జరుగుతోంది.

చికిత్సకు అనుమతి ఇచ్చినా..

దేశంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు ప్రైవేటు ఆస్పత్రులకు కరోనా చికిత్సకు అనుమతి ఇచ్చినా... ఫీజుపై నియంత్రణ ఉండేలా చర్యలు తీసుకున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు ఇప్పటికే ఫీజు రెగ్యులేటరీ అథారిటీలను ప్రకటించాయి. తమిళనాడులో లక్షణాల తీవ్రతను బట్టి ఎవరివద్ద ఎంత వసూలు చేయాలని స్పష్టంగా నిర్ధేశించింది. రాష్ట్రంలోనూ ఇదే తరహాలో రెగ్యులేటరీ అథారిటీలను ఏర్పాటు చేయాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ అంశంపై ఆలోచించాలని ప్రభుత్వాన్ని కోరతామని ప్రభుత్వవైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌ తెలిపారు.

ప్రస్తుతం కొవిడ్ కేసులకు గాంధీలోనే చికిత్స ఇస్తున్నా.. పెరుగుతున్న కేసులను చూస్తుంటే.. భవిష్యత్తులో ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ చికిత్సలు తప్పవన్న సంకేతాలు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఫీజు రెగ్యులేటరీ అథారిటీ ఉండాలని నిపుణులు పేర్కొంటున్నారు. లేకపోతే పేదలు, మధ్యతరగతి ప్రజలు భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి : దేశసేవలో ముందుంటాం... అత్యవసరంలో ఆదర్శంగా నిలుస్తాం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.