ETV Bharat / state

వేడుకల్లో పాల్గొన్న కరోనా పాజిటివ్​ వ్యక్తి.. ఆ గ్రామం లాక్​డౌన్.. - కరోనా వార్తలు

కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన వ్యక్తి... పశ్చిమగోదావరి జిల్లాలో ఓ వేడుకలో పాల్గొన్నట్లు తెలియడం వల్ల జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. అతడిని కలిసిన బంధువులందరికి వైద్యులు వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

corona-positive-to-one-more-man-and-tests-held-to-whole-family-at-west-godavari
వేడుకల్లో పాల్గొన్న కరోనా పాజిటివ్​ వ్యక్తి.. అధికారులు అప్రమత్తం
author img

By

Published : Mar 23, 2020, 3:25 PM IST

పశ్చిమగోదావరి జిల్లాలోని రాఘవాపురం గ్రామంలో ఈనెల 18న జరిగిన ఓ గృహ ప్రవేశ కార్యక్రమానికి ఓ ఉన్నతాధికారి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఆ అధికారి కుమారుడు లండన్ నుంచి రావడం వల్ల అతనికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించి పరీక్షలు నిర్వహించారు. అతను లండన్ నుంచి వచ్చిన తర్వాత ఏ ప్రాంతానికి వెళ్లాడని ఆరా తీశారు.

పశ్చిమగోదావరి జిల్లా రాఘవాపురం గ్రామానికి వచ్చినట్లు తెలియడం వల్ల జిల్లా అధికారులు అతడిని కలిసిన బంధువులందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 14 రోజుల పాటు బయటకు రావద్దని వారికి సూచించారు. రాఘవాపురం గ్రామానికి ఎవ్వరు ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా పాలనాధికారి ముత్యాల రాజు ఆదేశాలు జారీ చేశారు.

వేడుకల్లో పాల్గొన్న కరోనా పాజిటివ్​ వ్యక్తి.. అధికారులు అప్రమత్తం

ఇదీ చదంవండి:'ఎయిర్ ​ఇండియా' తెగువకు ప్రధాని ప్రశంసలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.