ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యుడు, వైకాపా పార్టీ నేత విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఇటీవల ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా... వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు.
మంగళవారం సాయంత్రం తనకు కరోనా సోకినట్లు ఆయన ట్వీట్ చేశారు. చికిత్స కోసం హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. 10 రోజుల పాటు తాను సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్తున్నట్టు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
ఇదీ చదవండీ...విద్యార్థుల్లో 'లెర్న్ టు ఎర్న్'కు నాంది పడాలి: సీఎం జగన్