భాగ్యనగరంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. నగరంలో చిన్నా, పెద్దా అని తేడా లేకుండా పులువురు కొవిడ్ మహమ్మారి కాటుకు గురవుతున్నారు. ఉస్మానియా మెడికల్ కళాశాలలో మరొకరికి కరోనా సోకిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.
గత శనివారం ఉస్మానియాలోని వైరాలజీ ల్యాబ్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌కి కరోనా సోకగా.... ల్యాబ్‌ని రెండు రోజుల పాటు మూసివేశారు. ల్యాబ్‌లో పనిచేసే వారికి వైద్య పరీక్షలు చేయగా నెగెటివ్ వచ్చినట్టు ఉస్మానియా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శశికళ తెలిపారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఐసీఎంఆర్ అనుబంధంగా పనిచేస్తున్నారని... బయట నుంచి రోజు ఉస్మానియాకి వచ్చి డేటా ఎంట్రీ చేస్తున్నట్టు స్పష్టం చేశారు . వైరాలజీ లాబ్‌ని శుద్ధిచేసి ... గత సోమవారం నుంచి తిరిగి వైద్య పరీక్షలు ప్రారంభించినట్లు డాక్టర్ శశికళ చెప్పారు.