ETV Bharat / state

భాగ్యనగరంలో కరోనా కలవరం - Telangana corona latest news

హైదరాబాద్​లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. జంటనగరాల్లో కరోనా మూడవ దశకు చేరిందా అన్న చందంగా వందల సంఖ్యలో పాజిటివ్​ కేసులు నమోదవుతున్నాయి. సోమవారం అనేక ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాల్లో కరోనా కలకలం రేగింది. కొవిడ్​-19 వైరస్‌తో ముందుండి పోరాడుతోన్న డాక్టర్లు, వైద్య సిబ్బంది, పోలీసులు, మీడియాలో కూడా సోమవారం కొత్త కేసులు నమోదైన తరుణంలో ఆయా విభాగాల్లో భయాందోళనలు తీవ్రమవుతున్నాయి.

Hyderabad latest news
Hyderabad latest news
author img

By

Published : Jun 8, 2020, 11:39 PM IST

గ్రేటర్ హైదరాబాద్​లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. పగబట్టినట్లుగా రోజురోజుకు పాజిటివ్​ కేసుల సంఖ్య అమాంతంగా పెరుగుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు గత వారం రోజులుగా పెద్దసంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. వారికి వైరస్‌ ఎక్కడి నుంచి సోకిందో కూడా తేల్చటం అధికారులకు కష్టసాధ్యంగా మారుతోంది.

ఐదు రోజుల్లోనే 618 కొత్త పాజిటివ్​ కేసులు...

లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తివేయటం వల్ల ప్రజలు కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకపోతుండటంతో వైరస్‌ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా.... వైరస్ అదుపులోకి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. గడిచిన ఐదు రోజుల్లోనే గ్రేటర్ పరిధిలో 618 కొత్త కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దాదాపుగా నగరంలో అన్ని ప్రాంతాలకు కరోనా విస్తరించింది. ప్రధానంగా పాతబస్తీ, ఖైరతాబాద్, కార్వాన్, ఎల్బీనగర్, సికింద్రాబాద్, అంబర్ పేట్, ముషిరాబాద్​లో అత్యధిక సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. రాంనగర్, భోలక్ పూర్, కాచిగుడా ప్రాంతాల్లో కరోనా వైరస్‌ మరింత విజృంభిస్తోంది.

తాత్కలిక సచివాలయంకు కరోనా సెగ...

తాత్కలిక సచివాలయం బీఆర్కే భవన్​కు కరోనా సెగ తగిలింది. ఆర్థికశాఖలో పొరుగుసేవల కింద పనిచేస్తున్న ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులోనే మరో ఉద్యోగికి కూడా కొవిడ్​-19 లక్షణాలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. దీంతో బీఆర్కే భవన్​లోని ఏడో అంతస్తులోని ఆర్థికశాఖ అధికారులు, సిబ్బంది అంతా హోంక్వారంటైన్​కు తరలించారు.

బల్దియా కార్యాలయంలో థర్మల్​ స్క్రీనింగ్​ ఎక్కడ?...

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కరోనా కేసు నమోదైంది. నాలుగో అంతస్తులో ఇంజినీరింగ్ సెక్షన్​లో విధులు నిర్వహించే ఉద్యోగికి కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. బాధితుని సతీమణి ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోందని... ఆమె నుంచే సోకవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆయన 5 రోజులుగా విధులకు కూడా హాజరు కావడం లేదని తెలిపారు. జీహెచ్ఎంసీ కార్యాలయం మొత్తాన్ని అధికారులు సోడియం హైపో క్లోరైడ్ ద్రావణంతో పిచికారీ చేశారు. దాదాపు 2 వేల మంది ఉద్యోగులు, నిత్యం 500 మంది విజిటర్స్ వచ్చే ఈ కార్యాలయంలో కనీసం థర్మల్ స్ర్కీనింగ్ సౌకర్యం కూడా లేదు. నగరమంతా ప్రతి కార్యాలయంలో థర్మల్ స్ర్కీనింగ్ ఏర్పాటు చేయాలని చెబుతున్న బల్దియా అధికారులు.. తమ కార్యాలయాల్లోనే థర్మల్ స్ర్కీనింగ్ లేకపోవడం పట్ల ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

బోయిన్​పల్లి మార్కెట్​ మూడు రోజులు బంద్​....

సికింద్రాబాద్ బోయిన్​పల్లి మార్కెట్​లో మరో ఇద్దరు దంపతులకు కొవిడ్​ లక్షణాలు ఉండడం వల్ల సిబ్బంది వారిని గాంధీ ఆస్పత్రికి తరలించి కరోనా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఫలితంగా మార్కెట్​ను మంగళవారం నుంచి మూడు రోజుల పాటు మూసివేసి రసాయనాలు పిచికారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే అల్వాల్ పరిధిలోని సంతోషి కాలనీలో కరోనాతో ఓ వృద్ధురాలు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు వెల్లడించారు.

అంబర్​పేటలో 9 కేసులు...

అంబర్​పేట నియోజకవర్గంలో మరో 8 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఉస్మానియా జనరల్ ఆసుపత్రి బి బ్లాక్​లో నింబోలి అడ్డలో పనిచేసే ఇద్దరూ హౌస్ సర్జన్లకు పాజిటివ్ నిర్ధరణ అయింది. భరత్ నగర్ బాగ్ అంబర్​పేట ప్రాంతంలో వ్యక్తికి కరోనా సోకింది. తిలక్​నగర్ ఓ అపార్ట్​మెంట్​లో ఉండే వృద్ధుడికి పాజిటివ్ నిర్ధరణ అయినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.

  • కాచిగూడ నింబోలి అడ్డలో మరో వృద్ధునికి, నల్లకుంట విద్యానగర్​లో యువకుడికి కరోనా సోకింది. గోల్నాక పరిధిలోని ఓ మహిళకు, అశోక్ నగర్​లో మరో వ్యక్తికి కొవిడ్​ పాజిటవ్ నిర్ధరణ అయినట్లు అధికారులు వెల్లడించారు.
  • ముషీరాబాద్ నియోజకవర్గంలో కొత్తగా 9 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. రాంనగర్​లో నివసించే నిమ్స్ ఆసుపత్రి నర్సుకు, కవాడిగూడలోని ఓ గృహిణికి కరోనా సోకింది. గాంధీనగర్, భోలక్​పూర్,​ లలితా నగర్ ప్రాంతాలకు చెందిన ఐదుగురు వ్యక్తులకు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఉస్మానియా ఆసుపత్రిలో పనిచేస్తున్న ఇద్దరు యువ డాక్టర్లకు కరోనా సోకింది.
  • మేడ్చల్ జిల్లా జవహర్​ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శివాజీనగర్ కాలనీలో ఓ వ్యక్తికి కరోనా సోకింది. మల్కాజిగిరి మీర్జాల్​గుడాలో నివసించే గాంధీ ఆసుపత్రి వైద్యునికి కరోనా నిర్ధరణ అయింది.
  • రంగారెడ్డి జిల్లా అమనగల్లులో ఒకరికి కారోనా నిర్ధరణ కావడం వల్ల స్థానిక అధికారులు గాంధీ ఆసుపత్రికి తరలించారు.

ఇవీ చూడండి: కరోనా రోగుల కోసం అన్ని సదుపాయాలు ఉన్నాయి : సీఎం కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.