ETV Bharat / state

ఏపీలో 473కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు - covid cases in andhra

ఆంధ్రప్రదేశ్​లో రోజు రోజుకు కరోనా వైరస్​ విజృంభిస్తోంది. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి ఇవాళ ఉదయం 9 గంటల వరకు 34 కేసులు నమోదయ్యాయి.

corona positive cases in andhrapradesh is reached to 473
ఏపీలో 473కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
author img

By

Published : Apr 14, 2020, 1:21 PM IST

ఏపీలో సోమవారం సాయంత్రం నుంచి ఈరోజు ఉదయం గంటల వరకు 34 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 16 కొవిడ్-19 పాజిటివ్ కేసులతో గుంటూరు జిల్లాలో కేసుల సంఖ్య 109కి పెరిగింది. కృష్ణా జిల్లాలో కొత్తగా నమోదైన 8 పాజిటివ్‌ కేసులతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 44కు పెరిగింది.

కర్నూలు జిల్లాలో కొత్తగా 7 కేసులు నమోదవగా.. మొత్తం కేసుల సంఖ్య 91కి చేరింది. అనంతపురం జిల్లాలో కొత్తగా 2 పాజిటివ్‌ కేసులు నమోదై మొత్తం సంఖ్య 17 కేసులకు పెరిగింది. నెల్లూరు జిల్లాలో కొత్తగా ఒక కరోనా పాజిటివ్‌ కేసు నమోదవగా... మొత్తంగా 56 కేసులు నమోదయ్యాయి.

ప్రకాశం జిల్లాలో ఇప్పటివరకు 42 కేసులు, కడప జిల్లాలో ఇప్పటివరకు 31 కేసులు, తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటివరకు 17 కేసులు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటివరకు 23 కరోనా పాజిటివ్‌ కేసులు, చిత్తూరు జిల్లాలో ఇప్పటివరకు 23 కేసులు, విశాఖ జిల్లాలో ఇప్పటివరకు 20 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇవీ చూడండి: కేసీఆర్‌ అంబేడ్కర్ ధోరణినే అవ‌లంభిస్తున్నారు: ఎర్రబెల్లి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.