ETV Bharat / state

మా గోడు పట్టించుకోరూ ప్లీజ్​: నెట్టింట కరోనా బాధితుల విన్నపం - నెట్టింట కరోనా బాధితుల విన్నపం

‘నాకు కరోనా లక్షణాలున్నాయి.. అంబులెన్స్‌ పంపి ఆసుపత్రికి తీసుకెళ్లే ఏర్పాటు చేయరూ' అంటూ ఒకరు. ‘శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది.. నాకు బతకాలనుందని మరొకరు ఇలా కరోనా బాధితులు పెడుతున్న వేడుకోలు ప్రస్తుతం నెట్టింట కనిపిస్తున్నాయి. వీటిపై నెటిజన్లు వాట్సాప్​ గ్రూపులు, హ్యాష్​ట్యాగ్​లతో స్పందిస్తున్నారు.

corona patients requests in social media
మా గోడు పట్టించుకోరూ ప్లీజ్​: నెట్టింట కరోనా బాధితుల విన్నపం
author img

By

Published : Jul 14, 2020, 8:42 AM IST

కరోనా సోకినవారు పెడుతున్న పలు పోస్టులు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్నాయి. మరికొందరు ప్లాస్మా ఇవ్వాలంటూ అభ్యర్థిస్తున్నారు. అటు ఆసుపత్రుల్లో పడకలు దొరక్క.. ఇటు వైరస్‌ నిర్ధారణ పరీక్షకు అవకాశం లభించక అనేకమంది తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

కొవిడ్‌-19 టీఎస్‌హెల్ప్‌ హ్యాష్‌ట్యాగ్‌...

‘సికింద్రాబాద్‌లో ఉంటాం. మా బాబాయ్‌కి నాలుగు రోజుల క్రితం కరోనా నిర్ధారణ అయింది. శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. ఏ ఆసుపత్రీ చేర్చుకోలేదంటూ.. కొవిడ్‌-19 టీఎస్‌హెల్ప్‌ పేరుతో హ్యాష్‌ట్యాగ్‌ చేసి ట్విట్టర్‌ వేదికగా ఓ వ్యక్తి షేర్‌ చేశారు. రోగి వివరాలు, ఫోన్‌ నంబరు ఉంచి సాయం అర్థించాడు. వెంటనే ఆరోగ్య శాఖ ఫోన్‌ చేసింది. పలువురు నెటిజన్లు స్పందించారు.

ప్లాస్మా దాతల గురించి ఆరా

కరోనా బారిన పడి కోలుకున్నవారి ప్లాస్మా కోసం సోషల్‌ మీడియాలో అభ్యర్థనలు వస్తున్నాయి. ‘కొవిడ్‌ను జయించినవారు మీకు ఎవరైనా తెలుసా..? పాజిటివ్‌ రక్త గ్రూపు ఉండి ప్లాస్మాను దానం చేసేందుకు సిద్ధంగా ఉన్నారా..?. నా భర్త గత పది రోజులుగా కొవిడ్‌తో బాధపడుతున్నారు. ఆయన పరిస్థితి రోజురోజుకు విషమిస్తోంది. మీకు సమాచారం తెలిస్తే కింది నంబర్లకు ఫోన్‌ చేయండి’ అంటూ ఓ బాధితుడి భార్య సోషల్‌ మీడియాలో వేడుకొంది.

వాలంటీర్ల కోసం విన్నపాలు

సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి అభ్యర్థనల నేపథ్యంలో యువకులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నారు. ఆక్సిజన్‌ సిలిండర్లు అందించేందుకు ఓ వైపు ఎన్జీవోలు, ప్లాస్మాను ఇచ్చేందుకు కొవిడ్‌ విజేతలు ముందుకు వస్తుండటం విశేషం. నగరంలో పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో వాలంటీర్ల అవసరం పెరిగిందని, కంటైన్మెంట్‌ ప్రకటించిన అపార్ట్‌మెంట్‌కు ఒక వాలంటీర్‌ ఉంటే వైరస్‌ వ్యాప్తిని సమర్థంగా నిరోధించగలమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ప్రముఖుల రీట్వీట్‌

మనిషికి మనిషి సాయం చేసుకోవాల్సిన తరుణమిది. నీకు నేను తోడున్నాను అని పరస్పరం ధైర్యం చెప్పుకోవాల్సిన వేళ ఇది. వేలాది మంది వైరస్‌ మహమ్మారి బారిన పడుతున్నారు. మీ తరఫున నేతలు, అధికారులను మేము అభ్యర్థిస్తాం అంటూ కొవిడ్‌-19 టీఎస్‌ హెల్ప్‌ హ్యాష్‌ట్యాగ్‌ను రూపొందించిన ప్రతినిధులు చెబుతున్నారు. ఈ హ్యాష్‌ట్యాగ్‌ను అభినందిస్తూ సినీ ప్రముఖులు వెన్నెల కిషోర్‌, దర్శకుడు సుధీర్‌వర్మ తదితరులు రీట్వీట్‌ చేశారు.

విస్తృతంగా ప్రచారం చేయిస్తాం

ప్రస్తుతం ప్లాస్మా దాతల గురించి ఆరా తీయడం పెరిగింది. దాతలు స్పందించేలా ప్రముఖులతో ప్రచారం చేయించేందుకు ప్రయత్నిస్తున్నామని సాయిరాజేశ్​ అనే ఫిల్మ్‌మేకర్​ తెలిపారు. ఇప్పటి వరకు 200 మంది వాలంటీర్లు చేరారు. రెండు రోజుల క్రితం హ్యాష్‌ట్యాగ్‌ను ప్రారంభించాం. గురువారం సాయంత్రం నుంచి ఫోన్‌కాల్స్‌ పెరిగాయి. పల్మనాలజిస్ట్‌, కార్డియాలజిస్ట్‌, జనరల్‌ ఫిజీషియన్లతో కూడిన 15 మందితో కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేశాం. కరోనాతో బాధపడుతున్నవారికి సలహాలు, సూచనలు అందిస్తున్నామని అతను చెప్పారు.

ఇదీ చూడండి: బాలిక అభ్యర్థనపై స్పందించిన కలెక్టర్..​ స్మార్ట్​ఫోన్​ కానుక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.