ETV Bharat / state

ఆస్పత్రుల్లో రోగుల అవస్థలు.. బయట కుటుంబసభ్యుల అష్టకష్టాలు - కరోనా రోగుల అవస్థలు

కరోనా కారణంగా తీవ్ర అనారోగ్యం బారిన పడిన అనేక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తమవారిని ఆస్పత్రిలో చేర్చేవరకు కుటుంబ సభ్యులు అష్టకష్టాలు పడుతున్నారు. ఆ తర్వాత ఇంజెక్షన్లు, మాత్రల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమవారి ప్రాణాలను కాపాడుకునేందుకు చెప్పులరిగేలా తిరుగుతూ.. తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఆస్పత్రుల ఆవరణలో, ఫుట్‌పాత్‌లపై నిద్రిస్తున్నారు. వీలైతే బంధువుల ఇళ్లకు వెళ్లి తలదాచుకుంటున్నారు.

corona-patients-family-members-suffers-outside-of-hospitals
ఆస్పత్రుల్లో రోగుల అవస్థలు.. బయట కుటుంబసభ్యుల అష్టకష్టాలు
author img

By

Published : May 8, 2021, 9:28 AM IST

హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి(55)కి ఆక్సిజన్‌ స్థాయులు పడిపోవడంతో ఆయన్ను అంబులెన్స్‌లో తీసుకుని ఆస్పత్రికి బయల్దేరారు. వెంటిలేటర్‌ పడక కోసం అన్వేషించారు. నాలుగు ఆస్పత్రుల చుట్టూ తిరిగి చివరకు గాంధీ ఆస్పత్రికి వచ్చారు. అక్కడా పడకల్లేకపోవడంతో బయటే అంబులెన్సులో ఉంటూ పడిగాపులు కాస్తున్నారు. ఇంటి పెద్దకు ఏమవుతుందోనని తల్లడిల్లుతోంది ఆ కుటుంబం!

నిజామాబాద్‌కు చెందిన ఓ దంపతులకు కరోనా సోకింది. భార్య(41)కు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ సోకడంతో మెరుగైన చికిత్స అవసరమైంది. భర్త హోం ఐసోలేషన్‌లో ఉండటంతో.. ఆ మహిళకు ఒక్కగానొక్క కుమార్తె(20) దిక్కయ్యింది. తొలుత నిజామాబాద్‌ ఆసుపత్రుల చుట్టూ తిరిగిన ఆమె.. తర్వాత హైదరాబాద్‌కు వచ్చి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తల్లిని చేర్పించింది. వైద్యులు రెమెడెసివిర్‌ ఇంజెక్షన్లు తెచ్చుకోవాలని చెప్పడంతో ఊరు కాని ఊరిలో అమ్మ ప్రాణాలను నిలబెట్టుకునేందుకు కాళ్లరిగేలా తిరిగింది. చివరకు ఆస్పత్రి యాజమాన్యాన్ని బతిమిలాడి ఇంజెక్షన్లు సంపాదించింది. అయినా అమ్మ ఆరోగ్యం క్షీణించడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ గంటల తరబడి ఎదురుచూశాకగానీ పడక దొరకలేదు. ఇప్పటికీ ఆ తల్లీకుమార్తెల కష్టాలు తీరలేదు!

వీరే కాదు.. హైదరాబాద్‌లోని గాంధీ, గచ్చిబౌలి టిమ్స్‌, కింగ్‌కోఠి, వరంగల్‌లోని ఎంజీఎం, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌లలోని ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు పలు ప్రైవేటు వైద్యశాలల్లో వారు పడరాని పాట్లు పడుతున్నారు. తమకోసం వచ్చినవారు బయట ఇబ్బందులు పడుతుండగా.. ఆస్పత్రుల్లో రోగులూ చాలా కష్టాలను ఎదుర్కొంటున్నారు. సాధారణంగా కరోనా బాధితులకు ఔషధాలు అందించడం, ఆక్సిజన్‌ పెట్టడం వంటి పనులను నర్సులు, ఇతర సిబ్బంది చూసుకుంటారు. అక్కడి వరకు పర్లేదుగానీ.. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నవారు, వయసు పైబడ్డవారు బాత్‌రూమ్‌కు వెళ్లిరావడం, ఆహారం తీసుకోవడం వంటి విషయాల్లో నరకం చూస్తున్నారు. రక్త పరీక్షలు, సీటీ స్కాన్‌లకు వెళ్లాల్సి వచ్చినప్పుడు.. నడవలేక ఇబ్బంది పడుతున్నారు. కింగ్‌కోఠి, నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రి వంటిచోట్ల సహాయకులుగా కుటుంబ సభ్యుల్ని అనుమతిస్తుండటంతో కొవిడ్‌ రోగులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.

తీవ్ర ఒత్తిడికి గురయ్యా

గత నెల 23న అమ్మకు పాజిటివ్‌ వచ్చింది. ఊపరితిత్తుల్లో 60 శాతం ఇన్ఫెక్షన్‌ ఉందన్నారు. పంజాగుట్టలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అతికష్టంమీద బెడ్‌ దొరికింది. రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు ఆస్పత్రివాళ్లే ఇచ్చారు. అయినా అమ్మ ఆరోగ్యం క్షీణించింది. ఐసీయూ బెడ్‌ ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. నాలుగు గంటలపాటు వేచి చూశాక టిమ్స్‌లో అడ్మిషన్‌ దొరికింది. ఇక్కడి వైద్యులు బాగా స్పందిస్తున్నారు. ఆహారం మాత్రం సరైన సమయానికి అందడం లేదు.

- నిజామాబాద్‌కు చెందిన ఓ యువతి

తండ్రి కోసం తనయుడి ఆరాటం

ఉప్పల్‌లో ఉంటూ టిప్పర్‌ నడిపే ఓ వ్యక్తి(53)కి 20 రోజులక్రితం కరోనా సోకింది. చికిత్స కోసం ఆయన్ను కుమారుడు(25) స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లాడు. సీటీ స్కాన్‌ చేయిస్తే.. ఊపిరితిత్తుల్లో 60 శాతం ఇన్ఫెక్షన్‌ ఉన్నట్లు తేలింది. దీంతో అక్కడి నుంచి గచ్చిబౌలి టిమ్స్‌కు తండ్రిని తీసుకెళ్లాడు. రెండు వారాలపాటు కొండాపూర్‌లోని మిత్రుడి గదిలో యువకుడు తలదాచుకున్నాడు. ఆస్పత్రిలో ఇచ్చే ఆహారాన్ని తండ్రి తినట్లేదని.. రోజూ మూడు పూటలా బయటి నుంచి ఆహారం తీసుకెళ్లి ఇచ్చాడు. ‘‘ఇప్పటివరకు భోజన ఖర్చులే రూ.7-8 వేలయ్యాయి. కొన్ని రోజుల నుంచి బయటి భోజనాన్ని అనుమతించడం లేదు’’ అని అతడు పేర్కొన్నాడు. ‘‘నేను సివిల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేశా. కొన్నాళ్లు ఉద్యోగం చేశా. తర్వాత ఓ కోర్సు నేర్చుకున్నా. మళ్లీ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా.. కరోనా సంక్షోభం మొదలైంది. ఇప్పుడు నాకు వేరే ఆలోచనల్లేవు. నాన్న ఆరోగ్యంగా ఇంటికి తిరిగి రావాలి. అందుకోసం ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటా’’ అని చెప్పుకొచ్చాడు.

అమ్మ వెంటే కుమారుడు ఉన్నా..
నిజామాబాద్‌ పట్టణానికి చెందిన ఓ మహిళ(55)కు కరోనా సోకింది. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ ఉన్నట్లు తేలింది. ఆమెకు కుమార్తెలు లేరు. ఒక్కగానొక్క కుమారుడే(25) తల్లితో పాటు ఆస్పత్రికి వెళ్లి కొవిడ్‌ వార్డులో ఉన్నాడు. రాత్రి అక్కడే పడుకుని.. ఉదయం ఇంటికి వెళ్లేవాడు. అల్పాహారం, భోజనం, పండ్ల రసాలు తీసుకొచ్చే అమ్మకు ఇచ్చేవాడు. ఆస్పత్రిలో దొరకని ఔషధాలను బయటినుంచి తీసుకురావడం, తల్లికి సమయానికి భోజనం పెట్టడం.. 12 రోజుల పాటు ఇదే అతడి దినచర్య. కానీ విధి అతణ్ని కరుణించలేదు. తల్లి ప్రాణాలను బుధవారం బలి తీసుకుంది. ‘‘ఆలస్యమైనా అమ్మ కోలుకుంటుందనుకున్నా. చూస్తుండగానే ఆమె ఆరోగ్యం క్షీణించడం, తిరిగిరాని లోకాలకు వెళ్లడం తట్టుకోలేకపోతున్నా’’ అంటూ ఆ యువకుడు కన్నీటిపర్యంతమయ్యాడు.

ఇదీ చూడండి: ఊపిరితిత్తులు దెబ్బతిన్నా కొవిడ్‌ను జయించిన యువ డాక్టర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.