ప్రభుత్వ ఆసుపత్రుల మాదిరిగానే ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని సీపీఎం నేత మల్లేష్ డిమాండ్ చేశారు. సికింద్రాబాద్‌లోని రేతిఫైల్ బస్‌స్టాప్ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో కరోనా వ్యాప్తికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల పట్ల నిరసన వ్యక్తం చేశారు. కొవిడ్ లాక్డౌన్ నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులకు గురైన పేద మధ్యతరగతి వర్గాల్లోని ఒక్కో కుటుంబానికి రూ.7500 రూపాయలను ఇవ్వాలన్నారు.
రాష్ట్ర సర్కార్ ఘోర వైఫల్యం..
కరోనా పరీక్షలు నిర్వహించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఉచితంగా కరోనా టెస్టులు నిర్వహించాలని..ఆ మేరకు అవసరమైతే చికిత్స సైతం అందించాలని కోరారు. ప్రస్తుత కేసులను చూస్తే దేశవ్యాప్తంగా దారుణ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే ఈ దుస్థితికి కారణమని స్పష్టం చేశారు.