ETV Bharat / state

తెలంగాణ పోలీసుల మీద కరోనా అధిక ప్రభావం - covid-19

రాష్ట్రంలో కరోనాపై పోరులో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా ముందు వరసలో ఉన్న పోలీసులు ఆ మహమ్మారి బారిన పడిన తీరు పోలీసు పరిశోధన, అభివృద్ధి సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా పోలీసు శాఖల్లో కరోనా బారిన పడి మరణించిన వారిలో తెలంగాణ రెండో స్థానంలో ఉన్నట్లు ఆ అధ్యయనం తేల్చింది. మహారాష్ట్ర తర్వాత ఎక్కువగా తెలంగాణ పోలీసు సిబ్బందే మరణించినట్లు వెల్లడైంది.

Corona high impact on Telangana police
తెలంగాణ పోలీసుల మీద కరోనా అధిక ప్రభావం
author img

By

Published : Sep 28, 2020, 5:06 AM IST

తెలంగాణ పోలీసుల మీద కరోనా అధిక ప్రభావం

దేశవ్యాప్తంగా మహారాష్ట్ర, తెలంగాణ పోలీసుల మీద కరోనా ప్రభావం అధికంగా ఉంది. మహారాష్ట్ర తర్వాత తెలంగాణలోనే అత్యధికంగా పోలీసులు కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. 'ఇండియన్‌ పోలీస్‌ రెస్పాన్స్‌ టు కొవిడ్‌-19' పేరిట పోలీసు పరిశోధన, అభివృద్ధి సంస్థ(బీపీఆర్డీ) చేపట్టిన అధ్యయనంలో ఈ విషయాలు వెలుగుచూశాయి. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా 410 మంది పోలీసు సిబ్బంది మరణించారు. మహారాష్ట్రలో అత్యధికంగా 129 మంది మృతి చెందగా.... తెలంగాణలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలో 32 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 21, ఉత్తరప్రదేశ్‌, బంగాల్‌లో 19 మంది చొప్పున మృతి చెందారు. బీపీఆర్డీ నివేదిక ప్రకారం ఆగస్టు 21 నాటికి దేశవ్యాప్తంగా 76 వేల 768 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. మహారాష్ట్ర12వేల760 కేసులతో అగ్రస్థానంలో ఉండగా.... తెలంగాణ 5 వేల 200 కేసులతో ఐదో స్థానంలో ఉంది. కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి తెలంగాణ పోలీసులు... అనేక చర్యలు చేపట్టారని బీపీఆర్డీ వెల్లడించింది. లాక్‌డౌన్‌ నిబంధనల ఉల్లంఘనుల గుర్తింపునకు ప్రత్యేక యాప్‌, సీసీటీవీ వ్యవస్థను ఏర్పాటు చేశారని తెలిపింది. ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు సహకారం అందించారని వివరించింది.

కరోనా నియంత్రణకు పలు చర్యలు

మిగతా ప్రభుత్వ యంత్రాంగాలతో కలిసి కరోనా నియంత్రణకు తెలంగాణ పోలీసులు చేపట్టిన పలు చర్యలను నివేదికలో బీపీఆర్డీ వెల్లడించింది. " పోలీస్​-వైద్యులు-పారామెడికల్​ సిబ్బంది, పోలీస్​-పురపాలక-రవాణా-నిత్యావసర సరకుల పంపిణీదారులతో వాట్సాప్​ గ్రూపుల ఏర్పాటు, సమీకృత కమాండ్​ కంట్రోల్​ రూం, కొవిడ్​ వార్​ రూం, డయల్​-100 వ్యవస్థ, జియోగ్రాఫికల్​ ఇన్​ఫర్మేషన్​ సిస్టమ్​, ఇతర సాంకేతికతల వినియోగం, పోలీసులకు అత్యవసర వైద్య సేవల విభాగాల ఏర్పాటు" తదితర చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది.

రాష్ట్రం

కరోనాతో మృతి

చెందిన పోలీసులు

వైరస్​ బారిన పడ్డవారు
మహారాష్ట్ర 12912,760
తెలంగాణ405,200
కర్ణాటక32----
ఆంధ్రప్రదేశ్​212,738
ఉత్తరప్రదేశ్​196,708
పశ్చిమబెంగాల్​195,794

ఇవీ చూడండి: మెరుగైన సమాజ నిర్మాణం కోసం యువత కృషి చేయాలి: సజ్జనార్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.